AGRICULTUREANDHRA PRADESH
రబి సీజన్ లో ఉల్లి పంటను పరిశీలించిన అధికారిని

రబి సీజన్ లో ఉల్లి పంటను పరిశీలించిన ఉద్యాన అధికారి
జి కళ్యాణి
(యువతరం న్యూస్ జనవరి 26)
డోన్ ప్రతినిధి
కామగాని గుంట్ల గ్రామం డోను మండలo లో ని రబీసీజన్ ఉల్లి పంటలో పంటకోత ప్రయోగం 2 ఇ .సురేష్ అనే రైతు పొలం లో నిర్వహించడం జరిగింది. ఈ పంట కోత ప్రయోగం నందు 9 కిలోల 4 వందల 55 గ్రాముల దిగుబడి వచ్చినది. ఆవులదొడ్డి గ్రామం డోను మండలంలోని రబీసీజన్ ఉల్లి పంటలో పంటకోత ప్రయోగం 1 కె.బసవరాజు అనే రైతు పొలం లో నిర్వహించడం జరిగింది. ఈ పంట కోత ప్రయోగం నందు 9 కిలోల 45 గ్రాముల దిగుబడి వచ్చినది.
ఈ కార్యక్రమంలో
ఉద్యాన శాఖ అధికారి
జి కళ్యాణి, ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స మండల్ కోఆర్డినేటర్ అబ్దుల్లా, రైతు భరోసా కేంద్ర సిబ్బంది హుసేనయ్య గ్రామాల కూలీలు పాల్గొన్నారు.