శ్రీశైల మహా క్షేత్రంలోని దేవస్థానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

శ్రీశైల మహా క్షేత్రంలోని దేవస్థానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
(యువతరం జనవరి 26) శ్రీశైలం ప్రతినిధి:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రం నందు దేవస్థానంలో ఈరోజు 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా దేవస్థాన పరిపాలన కార్యాలయ భవన ప్రాంగణంలో జాతీయ పతాకవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి శ్రీ మహాగణపతి పూజ జరిపించబడింది. తర్వాత జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పమాలను అర్పించబడింది. అనంతరం దేవస్థానం రక్షణ సిబ్బంది మరియు దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ హోంగార్డ్స్ సిబ్బంది పతాక వందనం చేశారు. ఆ తర్వాత ఆలయ కార్య నిర్వహణ అధికారి వారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయగీతం ఆలపించబడింది. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి ప్రసంగిస్తూ గత సంవత్సర కాలంలో దేవస్థానం సాధించిన ప్రగతిని వివరించారు. తమ ప్రసంగంలో వారు ఇందుకుగాను దేవస్థానాన్ని ఎంతో గాను శ్రీశైల మహా క్షేత్ర అభివృద్ధికి దేవస్థానం పలు చర్యలు చేపట్టిందన్నారు. అలాగే ధర్మకర్తలు మండల అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి మరియు ధర్మకర్తల మండల సభ్యులు వారు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రక్షాళన వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఇంకా వారు మాట్లాడుతూ వైదిక కార్యక్రమాలను శాస్త్రస్థాకంగా నిర్వహించడం భక్తులకు సౌకర్యాల కల్పన క్షేత్ర అభివృద్ధికి అనే వ్యూహంతో దేవస్థానం ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. క్షేత్ర అభివృద్ధిలో భాగంగా ఇటీవల రూ.215.04 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. క్యూ కాంప్లెక్స్ నిర్మాణం ఆలయ ప్రధాన వీధులలో సాలు మండపాల నిర్మాణం రూ. 52 కోట్లతో భక్తుల వసతి కోసం 200 గదుల నిర్మాణం మొదలైన పనులను త్వరలో ప్రారంభించాల్సి ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు మరియు క్షేత్ర సుందరీ కరణ భాగంగా క్షేత్ర పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగిందన్నారు.
ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరోవైపు శ్రీశైల క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. సూచి శుభ్రతలకు మన సనాతన ధర్మం ఎంతో ప్రాధాన్య తెచ్చింది అన్నారు. ముఖ్యంగా పరిశుభ్రత ఉన్నచోటనే దేవతలు వశించి ఉంటారని మన అర్షధర్మం చెబుతుందని, ఈ శుభ్రత అనేది ఆధ్యాత్మిక సాధనకు తొలిమెట్టు కూడా అని అన్నారు అందుకే శ్రీశైలం మహా క్షేత్రంలో పారిశుద్ధ్య నిర్వహణకు పలు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. రోజువారి పారిశుధ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తామన్నారు.
భక్తులకు ఆహ్లాదం కలిగే విధంగా శ్రీశైలం మహా క్షేత్రం ఉన్నంత నిరంతర పరిశుభ్రంగా ఉంచాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగిందన్నారు .గత వారంలో స్వచ్ఛ తీర్థ కార్యక్రమంలో భాగంగా 8 రోజులపాటు ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు కూడా చేపట్టమన్నారు .ప్రాచిన కాలం నుంచి కూడా మన ఆలయ సాంస్కృతిక కేంద్రాలుగా విలసిల్లాయని తెలుపుతూ ఆలయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు .ఇందులో భాగంగా మూడు అష్టావధానాలను అదేవిధంగా గీతవదానాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్తీక మాసంలో రాష్ట్రస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరుందిన పలు ప్రఖ్యాత కళాకారుల నృత్య ప్రదర్శనలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అన్ని విభాగాలు యూనిట్ అధికారులు పర్యవేక్షులు సిబ్బంది పాల్గొన్నారు.