ANDHRA PRADESHDEVELOPSTATE NEWS
శ్రీశైలం మహా క్షేత్రం నందు ఆగమ పాఠశాల విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేత

శ్రీశైలం మహా క్షేత్రం నందు ఆగమ పాఠశాల విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేత
(యువతరం జనవరి 26) శ్రీశైలం ప్రతినిధి:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రం నందు ఆగమ పాఠశాల విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలను దేవస్థానం వారు అందజేశారు. దేవస్థానం నిర్వహిస్తున్న వీరశైవ ఆగమ పాఠశాలలో ప్రవేశం పొంది మొత్తం ఆరు సంవత్సరాల వీరశైవ ఆగమ కోర్సును (ప్రవేశ, వర,ప్రవర) పూర్తిచేసిన నలుగురు విద్యార్థులకు ఈ రోజు పరిపాలన భవనం వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో దేవస్థాన ఆలయ కార్య నిర్వహణ అధికారి డి. పెద్దిరాజు విద్యా భాష ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అదేవిధంగా కోర్స్ పూర్తిచేసిన ఎం. పవన్ కుమార్ ,జి. మధు, జి. వెంకట కోటేశ్వరరావు ,ఎం. ప్రణయ కుమార్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 2.69లక్షల చొప్పున స్టయిఫండ్ మొత్తాన్ని చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది.