అధికార వైసిపి ఎన్నికల ప్లాన్ రెడీ

అధికార వైసీపీ ఎన్నికల ప్లాన్ రెడీ అయింది
(యువతరం జనవరి 22) విజయవాడ ప్రతినిధి:
175కి 175 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్.. భీమిలి నుంచి ఈ నెల 25న ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు.
రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి ప్రతీ జోన్లో కార్యకర్తలతో ముఖాముఖి, ఒక బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ దూసుకెళ్తాంది.
ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ అధిష్ఠానం ప్రచారంపై ఫోకస్ పెట్టింది.
ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించాలని నిర్ణయించింది.
ఈ నెల 25న సీఎం జగన్ అధ్యక్షతన ఉత్తరాంధ్ర ఆరు జిల్లాలకు సంబంధించి భీమిలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.
ఈ సభ నిర్వహహణపై ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు.
తొలి బహిరంగ సభ ద్వారా ఉత్తరాంధ్ర కార్యకర్తలు, అభిమానులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రతి నియోజవర్గం ఐదు నుంచి ఆరు వేల మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు.
ఉత్తరాంధ్రపై సీఎం జగన్ కు ప్రత్యేక శ్రద్ధ ఉందని..
అందుకే ఈ ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెడుతున్నారు.