సిపిఎం పార్టీ జిల్లా ఉద్యమ నిర్మాత నరసింహయ్యకు ఘన నివాళి

సిపిఎం పార్టీ జిల్లా ఉద్యమ నిర్మాత నరసింహయ్యకు ఘన నివాళి
(యువతరం జనవరి 18) దేవనకొండ విలేకరి:
కర్నూలు జిల్లా సిపిఎం ఉద్యమ నిర్మాత , కార్మిక కర్షక పోరాటయోధుడు తెలకపల్లి నరసింహయ్య గారి ఐదో వర్ధంతి సందర్భంగా మండలంలోని దేవనకొండ, తెర్నేకల్ గ్రామాలలో సిపిఎం మరియు ప్రజాసంఘాల నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు
గురువారం నాడు సందర్భంగా మండల కేంద్రంలో పార్టీ మండల కమిటీ సభ్యులు అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అపార్టీ జిల్లా నాయకులు బి.వీరశేఖర్, మండల కమిటీ సభ్యులు యూసుఫ్, మహబూబ్ బాషా, సీనియర్ నాయకులు నాగేష్ లు మాట్లాడుతూ అగ్రకులంలో పుట్టి అసమానతలు లేని సమాజం కోసం భూమి కొరకు భుక్తి కొరకు వేట్టి చాకిరి విముక్తి కొరకు అవిశ్రాంత పోరాటం చేసిన త్యాగధనుడు నరసింహయ్య గారు అని పేర్కొన్నారు 1964లో కమ్యూనిస్టు ఉద్యమ చీలిక సందర్భంగా జిల్లాలో మార్క్సిస్ట్ పార్టీ నిర్మాణం కోసం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొని, అనేక ఉద్యమాల ద్వారా జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ నిర్మించారని అదేవిధంగా వందల సంఖ్యలో కార్యకర్తలను తయారు చేశారని. నరసింహయ్య గారు నాటిన మొక్క నేడు మహా వృక్షమై పీడిత ,తాడిత ప్రజల తరఫున నిరంతర పోరాటాలు సాగిస్తుందని పేర్కొన్నారు నర్సింహయ్య గారి ఆశయమైన ప్రతి ఎకరాకు సాగునీరు, గిట్టుబాటు ధర, రైతుల కళ్ళల్లో ఆనందం చూడడం వాటికోసం నేటి యువతరం, పార్టీ ,ప్రజా సంఘాల కార్యకర్తలు కృషి చేయాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు నాగేంద్ర, కుంకునూరు శ్రీనివాసులు, రాజన్న, రసూల్, బజారి, గాజుల శ్రీనివాసులు, శ్రీరాములు ,లక్ష్మిరెడ్డి ,బడే సాబ్, కుమార్ ,కాంతయ్య, ఈరప్ప తదితరులు పాల్గొన్నారు.