నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లే

నా మాటంటే మాట నేను ఒక్క సారి చెపితే వంద సార్లు చెప్పినట్టే…… నన్ను నమ్మండి…నీ వెంట నేనున్నాను…వైసీపీ ఎమ్మెల్యే ఎర్రకొట చెన్నకేషవరెడ్డి…
(యువతరం జనవరి 2)
ఎమ్మిగనూరు ప్రతినిధి:
రాబోయే సార్వత్రిక ఎన్నికల దృశ్య వైసీపీ అధిష్టానం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో తన పార్టీ తరుపున గెలుపు గుర్రాలను వెతికి పార్టీ టికెట్ ను ఖరారు చేస్తూ వచ్చింది.ఇందులో మొదటి విడత, రెండోవిడుతా ఇలా అభ్యర్టుల పేర్లను ఖరారు చేస్తూ వచ్చింది.మరి..ఇందులో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజకు అలాగే నాయకులు ఎంతో ఆతృతగా ఎదురు చూసే వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ నాయకుడు ఎవరు అనే ప్రశ్నకు అనుమానాలకు తెరపడింది…
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ క్షేత్ర స్థాయి నాయకులు ప్రజలు ఎంతగానో ఎదురు చూసిన వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గా మాచని వెంకటేష్ ను అధిష్ఠానం ఖరారు చేసింది.మాచని వంశానికి ప్రపంచలోని దేశాల్లో కూడా ఈ కుటుంబానికి పేరుంది.
ఇదే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎన్నో సంవత్సరాలు గా వారికి నచ్చిన రాజకీయ పార్టీ లలో కొనసాగుతూ క్షేత్ర స్థాయి పదవుల్లో కొనసాగుతూ ప్రజలకు సేవలందించారు.
మాచని వంశానికి చెందిన మాచని వెంకటేషప్ప కౌన్సిలర్ గా సుదీర్ఘం కాలం పాటు కాంగ్రెస్ పార్టీ తరుపున కౌన్సిలర్ గా ,మరియు మున్సిపల్ వైస్ ఛైర్మన్ గా కొనసాగారు.తరువాత వారి తమ్ముడు కూడా తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి కి అత్యంత ఆప్తుడుగా ఉంటూ కొనసాగుతూ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడుగా చాలా కాలం చేసి ప్రజలకు సేవలందించిన ఘనత కూడా ఆయనకు ఉంది.,మరి ఇప్పుడు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్తిగా మాచని వెంకటేశ్ యొక్క భార్య గతంలో కౌన్సిలర్ గా కొనసాగింది.
మాచని సోమన్న కూతురు గతంలో తెలుగుదేశం పార్టీ తరుపున రాయదుర్గంలో నియోజకవర్గ మున్సిపల్ చైర్మన్ గా కొనసాగిన వైసీపీ పార్టీ ఇంచార్జ్ మాచని వెంకటేష్ కు సొంత అక్క.
ఇలా ఎన్నో పదవుల్లో ఇతరాత్రి పార్టీలలో నాయకులుగా కొనసాగిన మాచని కుటుంబసభ్యులు.
ప్రజలకు అందుబాటులో ఉండేవారు.ఇక ఎమ్మిగనూరు నియోజకవర్గ విషయానికి వస్తే వైసీపీ పార్టీ తరుపున ఎమ్మెల్యే అభ్యర్తిగా తనకు టికెట్ అధిష్టానం ఇచ్చింది.ఇంత పెద్ద బాధ్యత ను స్వీకరిస్తూ ప్రజలక
సేవలలందిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.ఎందుకంటే మాచని వెంకటేష్ కు నియోజకవర్గ వైసీపీ పార్టీ టికెట్ ఇప్పించిన నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేషవరెడ్డి
మరి ఈయన ఒక్క సారి చెపితే వంద సార్లు చెప్పినట్టే. నియోజకవర్గ ప్రజలు తాను వృద్ద్యపంలో ఉన్నందున అలాగే ఇక్కడ బీసీలు ఎక్కువ శాతం ఓటర్లు ఉండడం ఇలా ఇవన్ని కలిపితే ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి మాట వేదంగా భావించే నియోజకవర్గంలో తన అభిమానులు ఎంతో మంది ఉన్నారు.అధిష్టానం దగ్గర కూడా ఆయన తగ్గలేదంటే చెన్న కేశవరెడ్డి పవర్ ఏమో తనకు వయసు మీద పడిందే తప్పా తన రాజకీయానికి కాదని మరొక్క సారి నియోజకవర్గ ప్రజలకు ప్రతి పక్ష పార్టీలకు తెలిసొచ్చేలా తాను కోరినట్లు వైసీపీ పార్టీ టికెట్ తాను చెప్పిన అభ్యర్థి మాచని వెంకటేష్ కే టికెట్ ఇప్పించి తనలోని అసలైన రాజకీయకుడు ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి అని నిరూపించుకున్నారు.అందుకే నియోజకవర్గ తన అభిమానులు మా నాయకుడు ఒక్కసారి చెపితే వందసార్లు చెప్పినట్లు తనను నమ్మాలని తన వెంట నేనున్నానాని దానికి నిదర్శనం అధిష్టానం తాను కోరిన వ్యక్తికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా టికెట్ ఇప్పించడం అని అనుకుంటున్నారు.