ANDHRA PRADESHOFFICIALPOLITICS
ఓటరు జాబితాలో అవకతవకలపై కలెక్టర్ కు ఫిర్యాదు

ఓటరు జాబితాలో అవకతవకలపై కలెక్టర్ కు ఫిర్యాదు
(యువతరం నవంబర్ 30) కర్నూలు ప్రతినిధి:
కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎం.ఎల్.సి బీటీ నాయుడు మరియు మాజీ మంత్రి , ఎం.ఎల్.సి కే.యి. ప్రభాకర్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జీలతో కలిసి కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా.సృజన గారిని వారి ఛాంబర్ లో కలుసుకొని పత్తికొండ నియోజకవర్గం లోని ఐదు మండలాల ఓటర్ లిస్టులో అవకతవకలు (చనిపోయిన, పెళ్ళైన, వేరే చోటికి షిఫ్ట్ అయిన, డబల్ ఓట్లు, ఫేక్ ఓట్లు) పై విచారణ చేసి వెంటనే తొలగించడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.జిల్లా కలెక్టర్ కి ఆధారాలతో సహా మాజీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి .కే.యి. శ్యామ్ కుమార్ లు అందించారు.