ANDHRA PRADESHPOLITICS
తెనాలి మున్సిపల్ చైర్మన్ తాడిబోయిన రాధిక

తెనాలి మున్సిపల్ ఛైర్మన్ తాడిబోయిన రాథిక
(యువతరం నవంబర్ 17) తెనాలి ప్రతినిధి:
మున్సిపల్ ఛైర్మన్ గా తాడిబోయిన రాథిక ఎన్నికైనట్లు తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలిశర్మ తెలిపారు . గురువారం ఉదయం 11గం॥లకు జరిగిన ఛైర్మన్ ఎన్నిక ప్రత్యేక సమావేశంలో తాడిబోయిన రాథిక చే ప్రమాణ స్వీకారం గావించారు. స్దానిక MLA అన్నాబత్తుని శివకుమార్ Ex -Officio సభ్యునిగా హాజరయ్యారు.
ముందస్తు ఒప్పందంలో భాగంగా ఛైర్మన్ పదవి ఖాలేదా నశీం, తాడిబోయిన రాథిక చెరి సగం పిరియడ్ చేసే విథంగా అంగీకరించి అందులో భాగంగా ఖాలేదానశీం గతనెల 12న తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే.
ఈ సందర్భంగా సదరు పదవీ స్వీకారోత్సవ కార్యక్రమానికి వైకాపా శ్రేణులు తెనాలి టౌన్ పరిసర ప్రాంతాలనుండి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై రాథికా రమేష్ కు శుభాకాంక్షలు తెలుపూతూ హర్షాతిరేకాలు వ్యక్త పరచారు.