నంద్యాల అసెంబ్లీ బరిలోకి అభిరుచి మధు…..?????

నంద్యాల అసెంబ్లీ బరిలోకి” అభిరుచి మదు”
బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గా అభిరుచి మదు నియామకం
కేంద్ర ప్రభుత్వ అండదండలు ఉన్న అభిరుచి మదు
అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్దం
కార్యకర్తలకు భరోసా…సేవా కార్యక్రమాలతో గుర్తింపు
(యువతరం నవంబర్ 17) నంద్యాల ప్రతినిధి:
నంద్యాలలో రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి.వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న అధికార,ప్రతిపక్ష పార్టీలతో పాటు కేంద్ర పార్టీల నుంచి నేతలు నంద్యాల ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.దేశంలో రాజకీయంగా నంద్యాలకు ప్రత్యేక స్థానం ఉంది.నంద్యాల నుంచి రాష్ట్రపతి,ప్రధానమంత్రి,మినిస్టర్లు,స్పీకర్,ఎంపి,ఎమ్మెల్యే లు గా ఎందరో నాయకులు రాజకీయ పదవులు పొందారు.నంద్యాలలో ఏ పార్టీ నుంచి పోటీచేసిన దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది.రాజకీయ సంచానాలకు పెట్టింది నంద్యాల.నంద్యాలలో రోజు,రోజుకు రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి.నంద్యాల రాజకీయాల్లో మరో సంచలనానికి నాంది పలికింది.నంద్యాల అసెంబ్లీ బరిలోకి అందరికీ సుపరిచితుడైన అభిరుచి మదు( మధుసూధన్ రావు) రంగప్రవేశం హాట్ టాపిక్ గా మారిపోయింది.నంద్యాల ప్రజలు ఎవరూ ఊహించని విధంగా బరిలోకి వస్తుండడంతో రాజకీయ చర్చ మొదలైంది.ఇటీవల కాలంలో బిజెపి స్టేట్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అధిష్టానం ఆదేశాల మేరకు అసెంబ్లీ కన్వీనర్లు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే బిజెపి నంద్యాల అసెంబ్లీ కన్వీనర్ గా అభిరుచి మధును అధిష్టానం నిర్ణయించింది.పార్టీ ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో నియమించిన కన్వీనర్లు పార్టీ బలోపేతానికి కృషిచేయాలని ఆదేశించారు.బిజెపి కేంద్ర నాయకులు నడ్డా ,తదితర నాయకుల ఆశీస్సులు మెండుగా అభిరుచి మధుకు వున్నాయి.ఈ నేపథ్యంలోనే నంద్యాల అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు.భవిషత్ ప్రణాళికను సిద్ధం చేసుకొని త్వరలో నంద్యాల నియోజకవర్గం లోని స్నేహితులు,బందువులు,శ్రేయోభిలాషులు,పార్టీ పెద్దలు,కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచేసేందుకు సిద్దం అయ్యారు.ప్రణాళికను మీడియా సమావేశం ద్వారా ముందుకు సాగనున్నారు.గత 25 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.గతంలో తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు పొంది పార్టీ కి న్యాయం చేశారు.2019 ఎన్నికల అనంతరం బిజెపి పార్టీ లో చేరి బిజెపి కేంద్ర పెద్దలలో శబాష్ అనిపించుకున్నారు.జీవితంలో కలకు కన్న అవకాశం లభించడంతో పోటీలో నిలబడేందుకు ఆసక్తి చూపుతున్నారు.బిజెపి ప్రభుత్వంలోని పెద్దలు ఆదేశిస్తే పోటీకి సిద్దం అంటున్నారు.అధిష్టానం ఎవరికైనా బలపరుస్తే వారికి సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి సిద్దంగా వున్నారు.దేవుడి ఆశీస్సులతో చిన్న వ్యాపారం ప్రారంభించి అనతికాలంలో మంచి పేరు తెచ్చుకొని వివిధ వ్యాపారాల్లో మంచి లాభాలు గడించారు.వ్యాపారాల్లో వచ్చిన లాభాల్లో కొంత పేద ప్రజలకు,దేవాలయాలకు,మసీదులకు,చర్చి లకు వివిధ ప్రాంతాల్లో సహాయం అందించేవారు.ప్రచారాలకు దూరంగా సేవా కార్యక్రమాలు చేసేవారు.ప్రధానంగా నంద్యాల ప్రజలకు సుపరిచితుడు.సేవతో పాటు ఏ పార్టీలో వున్నా కార్యకర్తలకు భరోసా ఇచ్చేవారు.నంద్యాలలో కొద్ది రోజుల్లో ఏర్పాటుచేస్తున్న మీడియా సమావేశంలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.