ఆనందోత్సవాలతో దీపావళి

ఆనందోత్సవాలతో దీపావళి
(యువతరం నవంబర్ 13) మంగళగిరి ప్రతినిధి:
మంగళగిరి నగరంలో ఆదివారం దీపావళి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో ఆనంద ఉత్సవాలతో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం తలంటు స్నానాలు ఆచరించి సాయంత్రం ఇళ్ల ముంగిళ్ళలో దీపాలు వెలిగించి, బాణాసంచా టపాసులు కాల్చి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ భవనాలను, నివాస గృహాలను రంగు రంగు విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. సాయంత్రం గృహ ప్రాంగణం, తులసి కోట, వాకిళ్ళలో రంగవల్లులతో అలంకరించి దీపాలు వరుసగా అందంగా అలంకరించారు. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె, ఆవు నెయ్యి వేసి ఒత్తులతో వెలిగించే దీపం దివ్యశక్తిని ఆవహింపచేస్తుందని శాస్త్ర ప్రమాణం. సాయంత్రం దీపలక్ష్మిని, ధనలక్ష్మిని కుబేరున్ని భక్తి శ్రద్ధలతో పూజల నిర్వహించారు. అనంతరం ఇంటి ఆవరణలో, ఇంటి ఎదుట కుటుంబ సభ్యులు దీపావళి బాణాసంచా టపాసులు కాల్చి స్వీట్స్ పంచుకొంటూ హ్యాపీ దీపావళి అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందోత్సవాల మధ్య పండుగ జరుపుకున్నారు. పిల్లలు, యువకులు బాణాసంచా, మందు గుండు సామాగ్రిని కాలుస్తూ కేరింతల కొడుతూ పండుగను జరుపుకున్నారు.