
ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శిగా శానబోయిన అశోక్ నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేసిన జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్
(యువతరం నవంబర్ 13) ములుగు ప్రతినిధి:
ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క ఆదేశాలమేరకు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ములుగు మండలం ఇంచర్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, శానబోయిన అశోక్ ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేసిన ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్.
ఈ సందర్భంగా శానబోయిన అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క గెలుపు కోసం,కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ,పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు.తన నియమకానికి సహకరించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి, ఏఐసీసీ మహిళ ప్రధాన కార్యదర్శి ధనసరి సీతక్క కి, టీపీసీసీ సభ్యులు మల్లాడి రాంరెడ్డి కి, కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ కి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ కు , యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోతు రవిచందర్ కి, ములుగు జిల్లా అధికార ప్రతి ముస్నిపెళ్లి కుమార్ గౌడ్ కి, ములుగు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భగవాన్ రెడ్డి కి, ఏటూరు నాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న కి, కాంగ్రెస్ పార్టీ ములుగు మండల అధ్యక్షులు ఎండి.చాంద్ పాషా కి ,వర్కింగ్ అధ్యక్షులు నల్లెల భరత్ కి,SC సెల్ మండల అధ్యక్షులు మట్టెవాడ తిరుపతి కి, ములుగు జిల్లా నాయకులు వేముల సమ్మిరెడ్డి కి, కూనూరు అశోక్ గౌడ్ కి,ములుగు పట్టణ అధ్యక్షులు చింతనిప్పుల బిక్షపతి కి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు అందరికీ,అన్ని మండలాల అధ్యక్షులు గార్లు కు అశోక్ కృతజ్ఞతలు తెలిపారు…ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, యువజన నాయకులు అందరూ పాల్గొన్నారు.