పాములపాడు కేజీ రోడ్డు మీద ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలు వెంటనే తొలగించండి

*పాములపాడు కేజీ రోడ్డు మీద ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించండి:-ఎంపీడీవో డి. గోపికృష్ణ, ఎస్సై జి.అశోక్*.
(యువతరం నవంబరు 2) పాములపాడు ప్రతినిధి;
పాములపాడులోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన షాపుల, ఇండ్ల యజమానుల అవగాహన కార్యక్రమంలో కేజీ రోడ్డు మీద ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని ఎంపీడీవో డి.గోపికృష్ణ ఎస్సై జి. అశోక్ లు గ్రామ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ కి పాములపాడులోని జడ్పీ హైస్కూల్ నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు కేజీ రోడ్డు మీద పోటా పోటీగా వచ్చిన వ్యాపార సముదాయం మరియు ఇండ్ల కారణంగా ప్రజలు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాములపాడు బస్టాండ్ లో చాలా సార్లు యాక్సిడెంట్లు కూడా జరిగి తీవ్ర గాయాలను సంఘటనలు చాలా జరిగాయి అన్నారు. కేజీ రోడ్డు మీద ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించామని జిల్లా కలెక్టర్ గారికి, మండల అధికారులకు చాలామంది వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. కనుక కర్నూలు- గుంటూరు రహదారి మీద ఉన్న అక్రమ కట్టడాలను, మరియు మిట్టకందాల రోడ్డు బస్టాండ్ నుండి ఏపీ మోడల్ స్కూల్ వరకు అక్రమ కట్టడాలను నెలలోపు తొలగించాలని, లేనిపక్షంలో ప్రత్యేక చర్యలు తీసుకొని మేమే తొలగించడం జరుగుతుందన్నారు. ఇవి తొలగించిన అనంతరం ఇరువైపులా ఎంపీడీవో కార్యాలయం దగ్గర నుండి జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు పాధాచారుల కొరకు, చిన్నపిల్లలు, విద్యార్థుల కొరకు ప్లాట్ఫారం ఇరువైపులా నిర్మించడం జరుగుతుందన్నారు. రెండు మూడు రోజులలో ఆర్ఎంబి మరియు రెవెన్యూ అధికారుల మ్యాపులు తీసుకొని ఎంతవరకు తీయాలన్నది మార్కింగ్ వేస్తామన్నారు. కనుక మా వినతిని పరిగణలోకి తీసుకొని కేజీ రోడ్డు మీద ఉన్న, మరియు మిట్టకందాల రోడ్డు బస్టాండ్ నుండి ఏపీ మోడల్ స్కూల్ దాకా ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించి అధికారులకు సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో షాపు యజమానుల, ఇండ్ల యజమానుల, గ్రామ ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని, సంతకాలు కూడా తీసుకోవడ జరిగిందన్నారు. అనంతరం ఈ ఓ ఆర్ డి శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఇంటి పన్ను కట్టినంత మాత్రాన వారికి శాశ్వత హక్కు లభించదని, గ్రామంలో ఏ కట్టడాలు కట్టాలన్న, కర్మాగారాలు నిర్మించాలన్న, గ్రామపంచాయతీ అనుమతి తప్పనిసరిగా పొందాలని అన్నారు. అది కూడా ఇండ్లు, షాపులు, ఏ విధమైన అపార్ట్మెంట్లు కట్టాలన్న 300 చదరపు మీటర్లలోపు ఉన్న వాటికి గ్రామపంచాయతీ అనుమతిస్తుందని, 300 పైన ఉన్న పెద్ద పెద్ద అపాయింట్మెంట్లకు, షాపింగ్ కాంప్లెక్స్ లకు కర్నూలు హుడా కార్పొరేషన్ నుండి అనుమతి తీసుకోవాలని అన్నారు. ఇంతవరకు పాములపాడు మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా జరిగిపోయిందని, ఇకనుండి ప్రతి ఒక్కరూ గ్రామపంచాయతీ నుండి అన్ని అనుమతులు తీసుకొని నిర్మించవలసి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి డి.ప్రభాకర్, మండల కో ఆప్షన్ నెంబర్ సయ్యద్.ముర్తుజా అలీ, సబ్ డివిజనల్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎస్. షర్ఫద్దీన్ అలి, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, షాపుల, ఇండ్ల యజమానులు, పత్రికా విలేకరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.