
నందికొట్కూర్ ను, జూపాడు బంగ్లా ను కరువు మండలాలుగా ప్రకటించాలి సిపిఎం,
(యువతరం నవంబర్ 2) నందికొట్కూరు ప్రతినిధి;
మెట్ట ప్రాంతమైన నందికొట్కూర్, జూపాడుబంగ్లా మండలాలను రాష్ట్ర ప్రభుత్వం కరువు జాబితాలో చేర్చకపోవడం విడ్డూరమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు అన్నారు, గురువారం స్థానిక భరత్ కాంప్లెక్స్ లో సిపిఎం కార్యకర్తల సమావేశం సిపిఎం నాయకులు పిపకీరు సాహెబ్, అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ, నందికొట్కూరు జూపాడు బంగ్లా మండలాలలో వేలాది ఎకరాలలో రైతులు సాగు చేసుకున్న పంటలు పూర్తిగా ఎండిపోయిన సంఘటనలు మండల స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులకు కనిపించడం లేదని వారు ప్రశ్నించారు, రైతులు సాగుచేసిన పంటలకు పెట్టుబడులు రాకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుని పరిస్థితి నెలకొంది అని ఆవేదన వ్యక్తం చేశారు, కౌలు రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు అన్నారు, వర్షా బావ పరిస్థితులు వల్ల వేసిన పంటలు మొత్తము దున్నేశారని అధికారులు నివేదిక పంపకపోవడం ఆంతర్యం ఏమిటని అన్నారు, నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కేవలం తూతూ మంత్రంగా మూడు మండలాలను ప్రకటించడం విడ్డూరంఅన్నారు, తక్షణమే జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నియోజకవర్గం లోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులను సమీకరించి నిరవధిక ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు ,ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి ,సిపిఎం నాయకులు టి గోపాలకృష్ణ, ఎం కర్ణ, రాము, శివ, వీ ఆంజనేయులు, వేణుగోపాల్, రామిరెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.