ఓర్వకల్ పవర్ గ్రిడ్ లో అవినీతి నిరోధక అవగాహన వారోత్సవాలు

ఓర్వకల్ పవర్ గ్రిడ్ లో అవి నీతినిరోధక అవగాహన వారోత్సవాలు
(యువతరం నవంబర్ 2) ఓర్వకల్ విలేఖరి:
అవినీతి నిరోధక అవగాహన వారోత్సవాలలో భాగంగా ఈ దినము ఓర్వకల్ నందలి పవర్ గ్రిడ్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సు నందు ఏసీబీ ఇన్స్పెక్టర్ తేజేశ్వర్ రావు ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా ప్రతి పౌరుడు పోరాడాలని, ప్రతి ఒక్కరిలో అవినీతికి వ్యతిరేకంగా ప్రశ్నించే తత్వము అలవడాలని తద్వారా అవినీతి నిర్మూలనలో భాగం కావాలని పిలుపునిచ్చారు. టోల్ ఫ్రీ నెంబరు 14400 మరియు 14400 మొబైల్ ఆప్ ద్వారా ప్రజలు ఫిర్యాదులు ఆడియో మరియు వీడియో సాక్ష్యాలతో సహా అప్లోడ్ చేసినచో సదరు ఫిర్యాదులపై తగు చర్యలు తీసుకోబడునని తెలిపారు.
ఏసీబీ ఇన్స్పెక్టర్ వెంకట కృష్ణారెడ్డి అవినీతి నిరోధక
చట్టాల పట్ల అవగాహన కల్పించారు. ఏసీబీ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ బాషా, పవర్ గ్రిడ్ స్టేషన్ జనరల్ మేనేజర్ నాగేశ్వర రావు, డిప్యూటీ మేనేజర్ శంకరయ్య మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.