
యువతరం ఎఫెక్ట్
—————————
నాగులుకట్టకే అనుమతి మంజూరు…
– హర్షం వ్యక్తం చేసిన కాలనీవాసులు
– యువతరం దినపత్రిక ప్రభావంతో కదిలిన అధికారులు
(యువతరం నవంబర్ 02), మద్దికెర విలేఖరి ;
మండలకేంద్రమైన మద్దికెరలోని కుమ్మరమ్మ బావి స్థలంలో నాగులుకట్ట
నిర్మాణానికి అధికారులు అనుమతినీచ్చారు. దీంతో కాలనీవాసులు హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు యువతరం
దినపత్రిక ప్రభావంతో అధికారుల్లో చలనం రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గురువారం యువతరం
దినపత్రికలో ఆ స్థలంలో నాగులకట్టనే ఏర్పాటు చేయాలి అనే కథనం ప్రచురితమయ్యింది. ఇందుకు స్పందించిన
అధికారులు విచారణ చేపట్టి ఎట్టకేలకు ప్రజల విన్నపం మేరకు నాగుల కట్టను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.
ఈ మేరకు ఈఓపీఆర్ డి మద్దిలేటిస్వామి మాట్లాడుతూ నాగులకట్టకే అనుమతినిస్తూ అధికారులు చర్యలు తీసుకోవడం
జరిగిందని ఆయన చెప్పారు.