ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చేతుల మీదుగా సుంకేశ్వరిలో కమ్యూనిటీ హాల్ ప్రారంభం

సుంకేశ్వరి లో కమ్యూనిటీ హాలు … ప్రారంభించిన మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి
( యువతరం నవంబర్ 2): మంత్రాలయం ప్రతినిధి:
మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో రూ 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాలు భవనం ను పెద్దాయన టీటీడీ పాలకమండలి సభ్యులు వై. సీతారామిరెడ్డి , ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి గురువారం ప్రారంభించారు. ముందుగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రెడ్డి సోదరుల కు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు జి. భీమారెడ్డి, వైఎస్సార్సీపీ మండల ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి కి సర్పంచ్ ముక్కరన్న శాలువ కప్పి పూలమాలలు వేసి సన్మానించి స్వాగతం పలికి గ్రామ ప్రవేశం నుంచి కమ్యూనిటీ హాలు భవనం వరకు ఎద్దుల బండి పై ఉరేగింపు నిర్వహించారు. కమ్యూనిటీ హాలు భవనం వద్ద రెడ్డి సోదరుల ప్రత్యేక పూజలు నిర్వహించి, శిలఫలకం ను ఆవిష్కరించిన అనంతరం రిబ్బన్ కట్ చేసి భవనం ను ప్రారంభించారు. అనంతరం అతిథులకు పూలమాలలు వేసి శాలువ లు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కిరణ్, పీఆర్ డిఈ అశ్వ ధామ, ఏఈ నర్సింహులు , మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రాంపురం రెడ్డి సోదరుల అభిమానులు తదితరులు ఉన్నారు.