
*రోడ్డు విస్తరణకు సహకరించండి* *నల్లమడ,సీఐ రాజేంద్రనాథ్,యాదవ్*
(యువతరం నవంబర్ 2) అమడగూరు విలేఖరి
అమడగూరు:- మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ప్రాంతం నుండి ఉట్టి వరకు ప్రధాన రహదారి మధ్యలో నిర్మాణాలు కట్టారు.ఈ రహదారికి ఇరువైపులా ఇంటి నిర్మాణాలు రోడ్డుకు ఆనుకొని నిర్మించడంతో వాహనాలతో పాటు ప్రతి సంవత్సరం జరిగే చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ఊరేగింపుకి తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి.దీంతో సర్పంచ్ షబ్బీర్ భాషా,పంచాయతీ కార్యదర్శి చంద్ర,చొరవ తీసుకొని పంచాయతీ ద్వారా ఇంటి యజమానలకు రోడ్డుకు అడ్డంగా ఉన్న కట్టడాలు తొలగించాలని నోటీసులు అందజేశారు.అయితే కొంతమంది చాలా ఇరుకుగా ఉన్న కట్టడాలు తొలగించడానికి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో నల్లమాడ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ రహదారిని పరిశీలించారు.ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బంది ఎమ్మార్వో వెంకటరెడ్డి,సహయకారాలతో బస్టాండ్ ప్రాంతం నుండి ఉట్టి వరకు అక్రమ నిర్మాణాలు తొలగించి రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు.అదేవిధంగా ఇ ఓ ఆర్ డి నసీమ మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా నాలుగు అడుగులు పొడవు తొలగిస్తామని ఇంటి యజమానులకి చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో యస్.ఐ బలరామయ్య,ఎ ఎస్ఐ ధనుంజయ, రెవెన్యూ సిబ్బంది ఆర్ ఐ ,ఈశ్వరయ్య, వీఆర్వో పవన్, కుమార్,తదితరులు పాల్గొన్నారు.