శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి వారిని దర్శించుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దంపతులు

శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి వారిని దర్శించుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి దంపతులు
( యువతరం సెప్టెంబర్ 12) కౌతాళం విలేఖరి:
కౌతాళం మండల పరిధిలోని ఉరుకుంద గ్రామంలో వెలసిన శ్రీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి వారిని దర్శించుకునేందుకు విచ్చేసిన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనారెడ్డి దంపతులకు పాలకమండలి చైర్మన్ నాగరాజ్ గౌడ్ మంగళవారం ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉరుకుంద శ్రీ ఈరన్న స్వామి వారిని దర్శించుకునేందుకు మంగళవారం ఉరుకుంద క్షేత్రం కు వచ్చారు. శ్రావణమాసం ఉత్సవాల్లో భాగంగా శ్రీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి వారికి ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారిని వాణి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ఈ రప్ప స్వామి వారికి శేష వస్త్రం కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి సూపర్డెంట్ రామ్మోహన్, ఆలయ ట్రస్టు బోర్డ్ చైర్మన్ నాగరాజు గౌడ్ , మరియు ఆలయ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.