ఈనెల 30 నుండి జగనన్న ఆరోగ్య సురక్ష

ఈనెల 30 నుండి జగనన్న ఆరోగ్య సురక్ష
(యువతరం సెప్టెంబర్ 12) వెల్దుర్తి విలేఖరి:
ఈనెల 30 నుండి జగనన్న సురక్ష కార్యక్రమం మొదలు అవుతున్నట్లు వెల్దుర్తి మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మండల కేంద్రము లోని ఎంపీడీవో కార్యాలయం లో ఎంపీడీవో శ్రీనివాసరావు అధ్యక్షతన వెల్దుర్తి తో పాటు ఉలిందకొండ, గోవర్ధనగిరి, రామళ్లకోట పిహెచ్సి లకు చెందిన వైద్యులు డాక్టర్ ప్రతిభ, డాక్టర్ నవీన్ కుమార్, మండలంలోని, ఏఎన్ఎం లు, ఎం ఎల్ హెచ్ పి లు, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ లు, సెక్రటరీలు లతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈనెల 15 నుంచి గ్రామ వాలంటీర్లు, ఎన్ఎంలు, ఆరోగ్య ఆశా కార్యకర్తలు మండలంలోని ప్రతి ఇంటికి వెళ్లి వారి ఇంటిలో ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి ప్రత్యేక యాప్ లో నమోదు చేయాలన్నారు.అవసరమయిన వారికి అక్కడే షుగర్, బిపి, రక్త పరీక్షలు చేయాలన్నారు. ఈనెల 30 నుండి సచివాలయాల వారీగా తహసిల్దార్, ఎంపీడీవో ల ఆధ్వర్యంలో ప్రత్యేక టీములుగా వైద్య శిబిరాలు నెలరోజులపాటు నిర్వహిస్తారన్నారు. శిబిరాల నిర్వహణ సమయానికి ఏఎన్ఎం లు తమ యాప్ లో గుర్తించిన హెల్త్ రిపోర్టు శిబిరాలలో అందజేయాలన్నారు. వైద్య శిబిరాలలో స్పెషలిస్ట్ డాక్టర్లు, ఫ్యామిలీ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఉంటారన్నారు. అక్కడే మందులతోపాటు శస్త్ర చికిత్స వస్తువులు, ఎమర్జెన్సీ కిట్లు ఉంటాయన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి వైద్య శిబిరాలకు తరలిస్తే అక్కడ వైద్యులు పరిశీలిస్తారన్నారు. అవసరమైన వారికి ఈసీజీ సైతం చేసి మరీ చికిత్సలు అవసరమైతే డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ కింద రిఫర్ చేసి బాగు చేస్తారన్నారు.