
రైతులకు అందుబాటులో ఎరువులు
(యువతరం సెప్టెంబర్ 12) వెల్దుర్తి విలేఖరి:
మండలములోని అన్నీ రైతు భరోసా కేంద్రాలలో రసాయనిక ఎరువులు అందుబాటులో ఉన్నాయి అని మండల వ్యవసాయ శాఖ అధికారి అక్బర్ బాషా మంగళవారం తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోగలరని పేర్కొన్నారు.గోవర్ధనగిరి గ్రామములోని రైతు భరోసా కేంద్రములో రైతులకు ఎరువులు పంపిణీ చేయడం జరిగింది.గ్రామములో పంట నమోదు మరియు ఈ కేవైసి పై రైతులకు మరియు గ్రామ వాలంటీర్ వారికి సమావేశము నిర్వహించి పంట నమోదు మరియు ఈ కేవైసి ప్రక్రియను పరిశీలించడం జరిగింది.
పంట నమోదు మరియు ఈ కేవైసీ గడువు తేదీలలోపు తప్పనిసరిగా పూర్తి చేసే విదంగా గ్రామ వాలంటీర్ లు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి, గోవర్ధనగిరి గ్రామము, ఆర్.బి.కె ఇంచార్జి లింగన్న, స్వరూప మరియు గ్రామ వాలంటీర్లు రైతులు పాల్గొన్నారు.