శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి వారి దేవస్థానం తల నీలాలకు టెండర్ నోటీసు

శ్రీ మద్దిలేటి నరసింహ స్వామివారి దేవస్థానం
తలనీలాల వేలంపాట
(యువతరం సెప్టెంబర్ 2 )
బేతంచెర్ల విలేఖరి:
బేతంచర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామం శివారులో వెలసిన శ్రీ గణ మద్దిలేటి నరసింహస్వామి టెండరు నోటీసు నెం. 1/2023 తేది:26-08-2023 శ్రీ స్వామివారికి భక్తులు సమర్పించు తలనీలాలు
తేది: 09-09-2023 నుండి 08-09-2024 (12 నెలలు) కాలపరిమితికి ప్రోగు చేసుకొను హక్కు ఈ టెండరు, షీల్డు టెండరు బహిరంగ వేలం ప్రకటన పత్రము దేవదాయ శాఖ, నంద్యాల జిల్లా, బేతంచెర్ల మండలం, ఆర్.యస్.రంగాపురం గ్రామ శివార్లలో వెలసిన శ్రీ గణ.మద్దిలేటి నరసింహ స్వామి దేవస్థానం హక్కుభుక్తమైన శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పించు తలనీలాలు ప్రోగుచేసుకొనే హక్కు ఒక సంవత్సరమునకు అనగా తేది: 09-09-2023 నుండి 08-09-2024 వరకు లీజుకు ఇచ్చుటకు దేవస్థానకార్యనిర్వహణాధికారి కార్యాలయం నందు దేవదాయ శాఖ అధికారులు, ధర్మకర్తల మండలి సమక్షంలో తేది: 05-09-2023 ఉ. 10:00 గం. లకు ఈ – టెండరు, షీల్డు టెండరు బహిరంగ వేలం నిర్వహించబడును.
ఈ-టెండరు ద్వారా పాల్గొనదలచినవారు “టెండరు షెడ్యూలు డౌన్లోడ్ చేసుకొనుటకు ప్రారంభ తేదీ:టెండరు షెడ్యూలు సమర్పించుటకు చివరి తేది:టెక్నికల్ బిడ్ తెరచు తేది: ప్రైస్ బిడ్ తెరచు తేది:30-08-2023 ఉ. 10:00 గం||ల నుండి
05-09-2023 10:00 గం||ల వరకు
05-09-2023. 11:00
05-09-2023 మ. 12:00 గం||లకువేలంపాట షరతులు11)
ఈ బహిరంగవేలంపాట శ్రీయుత కమీషనరు, దేవదాయ శాఖ, వారి తుది ఆమోదపు ఉత్తర్వుల మంజూరుకు లోబడి
శ్రీ ఘన మద్దిలేటి నరసింహ స్వామి దేవస్థానం, కార్యనిర్వహణాధికారి వారిచే జరుపబడుచున్నది. 2) శ్రీయుత కమీషనరు, దేవదాయ శాఖ, విజయవాడ వారి ఉత్తర్వులకు లోబడి హెచ్చుపాట దారులు హెచ్చుపాట ఆమోదించిన 15 రోజులలోగా రూ.100/- నాన్ జ్యూడిషియల్ స్టాంపు పేపరుపై హెచ్చుపాట మొత్తమునకు ‘అగ్రిమెంటు వ్రాయించి రిజిష్టరు చేయించి ఇవ్వవలెను.
3) బహిరంగవేలంపాటలో పాల్గొనదలచినవారు రూ.50,00,000/- ధరావత్తు చెల్లించి పాటలో పాల్గొనవలెను. 4) తలనీలాలు ప్రోగుచేసుకొనెడి హక్కు వేలంలో పాల్గొనదలచిన వారు తమ ధరావత్తు మొత్తమును కార్యనిర్వహణాధికారి, శ్రీ గణ మద్దిలేటి నరసింహ స్వామి దేవస్థానం పేరున డి.డి ద్వారా చెల్లించవలెను. 15) షీల్డు టెండరు నందు పాల్గొను వారు ముందుగా ధరావత్తు మొత్తము రూ.50,00,000/- డి.డి ద్వారా చెల్లించవలెను.
అట్లు చెల్లించని వారి షీల్డ్ టెండరు తెరువబడదు.
16) “ముందుగా బహిరంగ వేలం నిర్వహించి హెచ్చుపాటను గుర్తించి, అనంతరము ఈ-టెండరు ఫైనాన్స్ బిడ్ ను. మరియు ఆ తరువాత టెండరు బాక్సును తెరచి, ఏ మొత్తము ఎక్కువగా ఉన్న ఆ మొత్తము అర్హత పొందిన బిడ్ గా నిర్ణయించబడును.
7) అర్హత పొందిన హెచ్చుపాటదారుడు పాట సగభాగము మొత్తమును పాట ముగిసిన వెంటనే చెల్లించవలెను. – మిగిలిన మొత్తమును తేది: 31-01-2024 లోపు చెల్లించవలెను.
8) హెచ్చుపాటదారుని పాట సమంజసముగా ఉన్నయెడల మాత్రమే శ్రీయుత కమీషనరు, దేవదాయ శాఖ, విజయవాడ + వారి ఉత్తర్వులకు లోబడి లైసెన్స్ హక్కు వారికి కేటాయించబడును,
ఈ విషయంలో ఏదేని సమస్య వచ్చిన శ్రీయుత కమీషనరు, దేవదాయ శాఖ వారిదే తుది నిర్ణయము.9) హెచ్చుపాటదారుడు పాట షరతులకు లోబడి పాట మొత్తమును చెల్లించకున్న, హెచ్చుపాటదారుని ధరావత్తు మొత్తము అపరాధము కింద దేవస్థానమునకు జమ కట్టుకొని, అదే హెచ్చుపాట మొత్తమునకు రెండవ | -హెచ్చుపాటదారునికి లైసెన్స్ హక్కుగా కేటాయించుటకు దేవస్థానము వారికి అధికారము కలదు.
ఈ విషయంలో శ్రీయుత కమీషనరు, దేవదాయ శాఖ వారిదే తుది నిర్ణయము.10) హెచ్చుపాటదారుడు హెచ్చుపాట మొత్తముపై 18% జీ.ఎ.స్టీ అదనంగా చెల్లించవలెను.
11) ఈ బహిరంగ వేలం దేవదాయ చట్టము 30/87 నిబంధనలను అనుసరించి జరుగుచున్నది. వాటిని అంగీకరించినవారు మాత్రమే బహిరంగవేలం నందు పాల్గొనుటకు అర్హులు.12) ఏ కారణము చేతనయినా / కారణము తెలపకనే పాట నిలుపుదల చేయుటకు గాని వాయిదా వేయుటకు గాని
దేవస్థాన అధికారులకు కలదు.
13) హెచ్చుపాటాదారుని డిపాజిట్ తప్ప మిగిలిన వారి డిపాజిట్ వేలం ముగిసిన వెంటనే వాపసు చేయబడును.
14) వేలం కాలపరిమితి తలనీలాలు ప్రోగుచేసుకొనెడి హక్కు ఒక సంవత్సరము అనగా 09-09-2023 నుండి 08-09-2024
వరకు మాత్రమే.
15) తలనీలాలు క్షురకులే తీయవలెను, కాంట్రాక్టర్లు తీయరాదు. వెంట్రుకలు మాత్రమే స్వాధీనము చేసుకొనవలెను.
16) లీజు సమయములో హెచ్చుపాటదారుడు తన స్వంత మనుషులతో కల్యాణకట్ట యందు వచ్చే తలనీలాలను
ఎప్పటికప్పుడు ప్రోగు చేసుకొనవలెను. ఈ విషయంలో దేవస్థానము అధికారులకు ఎలాంటి ప్రమేయం లేదు. 17) లీజు సమయంలో సంభవించు మార్కెట్ హెచ్చు తగ్గుల వలన వచ్చు లాభ నష్టములతో దేవస్థానమునకు
సంబంధము ఉండదు. 18) వేలం సమయంలో షరతులు మార్పు చేర్పులు చేయుటకు దేవస్థాన ఆధికారులకు అధికారము కలదు.19) దేవస్థానముతో ఎటువంటి లావాదేవీలు ఉన్నవారు కానీ, బకాయిలు ఉన్నవారు కానీ, దేవస్థాన సిబ్బంది కానీ మరియు దేవస్థానముతో పేచీలు కోర్టు కేసులు ఉన్నవారుకాని వేలంపాటలో పాల్గొనరాదు. 20) హెచ్చుపాటదారుడు ప్రభుత్వము వారికి చెల్లించవలసిన ఏదేని టాక్సులు & ఇతర పన్నులు తానే చెల్లించవలెను.
21) హిందూ మతస్థులు తప్ప ఇతర అన్య మతస్థులు వేలంపాటలో పాల్గొనరాదు.22) పై షరతులకు అంగీకరించిన వారే వేలంపాటలో పాల్గొనవలెను. పైన వివరించిన షరతులకు లోబడి బహిరంగ వేలం హెచ్చుపాటదారులు నడుచుకొనవలెను. షరతులుఉల్లంఘించినయెడల వెంటనే వారి లైసెన్సు రద్దుపరచి, తిరిగి వేలం జరిపి అందుపై వచ్చు నష్టము మొదటి హెచ్చుపాటదారు వద్దనుండి వసూలు చేయబడును.
ఇతర వివరములకు దేవస్థాన కార్యాలయ పనివేళలలో స్వయంగా సంప్రదించవచ్చును.
సదా శ్రీ స్వామి, అమ్మవార్ల సేవలో దేవస్థానం చైర్మన్ సీతా రామచంద్రుడు, చైర్మన్
ఎన్. తిమ్మారెడ్డి, ధర్మకర్త
టి.లక్ష్మి నాయుడు, ధర్మకర్త ఆర్.రామచంద్రుడు, ధర్మకర్త వై.ఈశ్వర రెడ్డి, ధర్మకర్త ఎ.లక్ష్మి దేవి, ధర్మకర్త బి.కిష్ణా రెడ్డి, ధర్మకర్త
యమ్.లక్ష్మి దేవి, ధర్మకర్త జి.నాగరాజమ్మ. ధర్మకర్త
ఎ.రామసుబ్బమ్మ, ధర్మకర్త ఎమ్. సుశీల, ధర్మకర్త పి.మద్దిలేటి స్వామి ఎక్స్-ఆఫీసియో మెంబర్
డి.పాండు రంగారెడ్డి,
కార్యనిర్వహణాధికారి (ఎఫ్.ఏ.సి). 9493300007