గ్రామాలలో వైయస్సార్ 14వ వర్ధంతి కార్యక్రమాలు

గ్రామాలలో వైయస్సార్ 14 వ వర్ధంతి కార్యక్రమాలు
గ్రామాలలో అన్నదాన కార్యక్రమాలు
(యువతరం సెప్టెంబర్ 2) తుగ్గలి విలేకరి:
మండలంలోని పలు గ్రామాలలో స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమాలను ఆయా గ్రామాల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అలాగే బోల్లవారిపల్లె గ్రామంలో స్థానిక వైసిపి నాయకుడు శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తుగ్గలిలో వైఎస్ఆర్సిపి నాయకులు మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగేబొల్లావాని పల్లె లో మాజీ జెడ్పిటిసి జగన్నాథ్ రెడ్డి, శేఖర్ రెడ్డి, రాతనలో వైఎస్ఆర్సిపి నాయకులు మోహన్ రెడ్డి ఉమా మహేశ్వర్ రెడ్డి ఎర్రగుడిలో రామచంద్రారెడ్డి, జిట్టా నగేష్, బొందిమడుగులలో ఈశ్వర్ రెడ్డి ఉప్పర్లపల్లిలో సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి , సురేంద్ర నాథ్ రెడ్డి ,భీమా నాయక్ తదితరులు వైఎస్ఆర్ వర్ధంతిని నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్సార్ ప్రజల మనిషి అని, ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకుడని, ఆయన పాదయాత్రలో అనేక సమస్యలు కళ్ళారా చూసి నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ ప్రజలకు అభయమిచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి తెచ్చిన ఘనత వైయస్సార్ కి దక్కిందన్నారు. ఆయన అడుగుజాడల్లోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా నిత్యం ప్రజల కోసం, రైతుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం తండ్రి కంటే రెండు అడుగులు ముందుకేస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని కొనియాడారు.