స్వామి వారు పల్లకిలో ఊరేగింపు

స్వామివారు పల్లకిలో ఊరేగింపు
ప్రత్యేక పూజలందుకున్న రంగనాథ స్వామీ
(యువతరం సెప్టెంబర్ 02), మద్దికేర విలేఖరి :
మండలంలోని పెరవలి గ్రామాల్లో వెలిసిన
శ్రీ రంగనాథ స్వామి వారికి శ్రావణమాస మూడో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పల్లకిలో ఉంచి ఊరేగించారు. ఉదయం 10 గంటల నుండి శ్రీ స్వామి వారి సుదర్శన స్వామిని పల్లకిలో ఉంచుకొని సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ స్వామి వారి పాదముల దగ్గర అర్చక స్వాములచే అభిషేకము, అర్చన, మంగళహారతి, నైవేద్యము, మంత్రపుష్పం పూజలు చేపట్టారు. అనంతరం పూజలు ముగించుకుని గ్రామ ప్రదక్షిణ ద్వారా దేవాలయమునకు స్వామి వారిని చేర్చారు. ఈ కార్యక్రమం పూర్వం నుండి స్వామివారు దొనకు పోయి వచ్చుట అని కూడా అంటారనీ గ్రామస్థులు తెలిపారు. గ్రామ ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు చేపట్టారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.