ముగిసిన వరుణ జపాలు

ముగిసిన వరుణ జపాలు
(యువతరం సెప్టెంబర్ 2) శ్రీశైలం ప్రతినిధి:
వర్షాభావ పరిస్థితులు తొలగి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో దేవస్థానం వరుణ హోమాలను, వరుణ జపాలను జరిపించింది.
వరుణ దేవుని అనుగ్రహం వలన తగినంత వర్షాలు కురుస్తాయని ప్రతీతి. గత నెల 26వ తేదీ నుంచి ఈ కార్యక్రమం నిర్వహించబడింది. శనివారంతో ఈ జపాలు హోమాలు ముగిశాయి. ఈ సందర్భంగా యాగ పూర్ణాహుతి జరిపించబడింది.
శనివారం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో నూతన వస్త్రాలు, పలుసుగంధద్రవ్యాలు మొదలైనవి యజ్ఞగుండంలో ఆహుతిగా సమర్పించబడ్డాయి.
కాగా ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు శివప్రసాద్ స్వామి, అధ్యాపక పూర్ణానంద ఆరాధ్యులు, సీనియర్ వేదపండితులు గంటి రాధాకృష్ణశర్మ పాల్గొన్నారు. దేవస్థాన అర్చక స్వాములు, వేదపండితులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు పండితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.