ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWSSTATE NEWS
కన్న తండ్రే కాల యముడు

కన్న తండ్రే కాల యముడు
కన్న కొడుకునే కర్కశంగా కడతేర్చిన తండ్రి
(యువతరం ఆగస్టు 30) కమలాపురం విలేఖరి:
కడప జిల్లా కమలాపురం మండలం ఆగస్త లింగాయపల్లి ( నడింపల్లి) లో ఈ తెల్లవారుజామున చోటుచేసుకున్న దారుణం.తెల్లవారుజామున తన తండ్రి ప్రక్కనే నిద్రిస్తున్న సమయంలో కన్న కొడుకుని అతికిరాతకంగా గొంతు కోసిన తండ్రి.అగస్తలింగాయపల్లి గ్రామానికి చెందిన వీరంరెడ్డి శంకర్ రెడ్డి భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో డోజర్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం.మృతుడు తన కొడుకు సోమేశ్వర్ రెడ్డి (12) గా గుర్తింపు.కొన ఊపిరితో కొట్టుమిట్టాడు తున్న సోమేశ్వర్ రెడ్డి ని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి.ఘటనకు గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.