ANDHRA PRADESHDEVOTIONALSTATE NEWS
శ్రీరాఘవేంద్ర స్వామి వారి మహోత్సవాలు ఘనంగా ప్రారంభం

శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మహోత్సవాలు ఘనంగా ప్రారంభం
( యువతరం ఆగస్టు 29) మంత్రాలయం ప్రతినిధి:
మంత్రాలయం ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 352 వ సప్త ఆరాధన మహోత్సవాలను పీఠాధిపతి స్వామీజీ తీర్తులు మంగళవారం అట్టహాసంగా ప్రారంభించారు. 7 రోజులపాటు జరిగే ఆరాధన మహోత్సవాలు పురస్కరించుకొని మొదటిరోజు ముందుగా గోపూజ, అశ్వ పూజలు చేసి , శ్రీ మఠం ముఖ ద్వారం పైన కాషాయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు. శ్రీ మఠం ప్రధాన పరిపాలన ప్రోగ్రాంలో లక్ష్మీ పూజలు చేసి వివిధ ధాన్యాలకు మంగళ హారతి ఇచ్చి ఆశీర్వదించారు.