విధులలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు
కర్నూలు జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్

విధులలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు
(యువతరం ఆగస్టు 30) కర్నూలు ప్రతినిధి:
విధులలో ప్రతిభ కనబరిచిన పోలీసుఅధికారులను , సిబ్బందిని అభినందించి , ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ అందజేశారు.
విధులలో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులను, సిబ్బందిని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఇందులో
1) కర్నూలు పట్టణ డిఎస్పీ విజయ శేఖర్ ,
2) కర్నూలు ఒకటవ పట్టణ సిఐ నాగ శేఖర్ ,
3) స్పెషల్ బ్రాంచ్ ఎఎస్సై మౌలాలి ,
4) స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ సాధిక్ ఉన్నారు.
కర్నూలు పట్టణంలో ఎలాంటి మత పరమైన సంఘటనలు జరగకుండా అన్ని వర్గాల వారితో మమేకమౌతూ కర్నూలు పట్టణంలో శాంతి సామరస్యం వెదజల్లెవిధంగా కృషి చేసినందుకు అభినందించారు.
జిల్లాలో పండుగలు, ర్యాలీలు, సమావేశాలు, వివిఐపి సమావేశాలలో ముందుచూపుగా, చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారుల కు, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలిపారు.
కర్నూలు పట్టణంలో ఇటీవల బక్రీదు, రంజాన్ మరియు తదితర పండుగలను ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకున్నారు.
రాబోయే రోజులలో జిల్లా ప్రజలందరూ వినాయచవితి వంటి అన్ని పండుగలను, ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో కలిసి మెలిసి చేసుకుంటూ సోదరభావంతో మెలగాలని జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ టి. సర్కార్, స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్, కర్నూలు త్రీ టౌన్ సిఐ మురళీధర్ రెడ్డి , స్పెషల్ బ్రాంచ్ ఎస్సై చంద్రకాంత్ పాల్గొన్నారు.