అనంత విశ్వంలో రెపరెపలాడింది నవభారత కీర్తి పతాకం

అనంత విశ్వంలో రెపరెపలాడింది నవభారత కీర్తి పతాకం
రుద్రరాజు నాని రాజు
(యువతరం ఆగస్టు 24) అమలాపురం ప్రతినిధి:
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 విజయవంతం మవ్వడం అత్యంత అద్భుత విషయమని, అనంత విశ్వంలో రెపరెపలాడింది మన నవభారత కీర్తి పతాకమని, నూతన అధ్యాయాన్ని సృష్టించిన ఇస్రో చంద్రయాన్ -3 విజయవంతం కృషిచేసిన శాస్త్రవేత్తలకు .సాయి సంజీవని వాకర్స్ యోగ ఆరోగ్య సేవా సంస్థ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు వెంకటరాజు నాని రాజు శుభాకాంక్షలు అందజేశా రు.. బుధవారం రాత్రి అమలాపురం సాయి సంజీవిని ఆసుపత్రిలో జరిగినసాయి సంజీవిని వాకర్స్ యోగ సంస్థ సభలో ఆయన ప్రసంగించారు. బుధవారం సాయంత్రం సుమారు 6 గంటలకు లాండర్ విక్రమ్ చంద్రుడు దక్షిణ ధ్రువం పై ల్యాండ్ అయిందని దీనితో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారతదేశం నిలిచిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలకు ఈ విజయం అంకురార్పణ జరిగిందన్నారు. ఇది భారత జాతి గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. యావత్ భారతావని ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తల శ్రమవెలకట్టలేని దని,ఇది చారిత్రాత్మక ఘట్టం అని ఆయన అన్నారు. ప్రముఖ కవి సాయి సంజీవిని వాకర్స్ యోగ ఆరోగ్య సంస్థ కార్యదర్శి నల్లా నరసింహమూర్తి మాట్లాడుతూ మొదటిసారి జాబిలమ్మ దక్షిణ ద్రవం పై అడుగు మోపి నూతన చరిత్ర సృష్టించి యావత్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకొని మరొకసారి భరత దేశంతన ఖ్యాతి ని నిరూపించుకుందని ఆయన అన్నారు.”భారతీయులకు నైనానందకరం”అనే కవితలు చదివారు. కోశాధికారి ప్రముఖ కవి బీ.వీ.వి సత్యనారాయణ మాట్లాడుతూ ఎటువంటి అవరోధాలు లేకుండా ల్యాండ్లరువిక్రమ్ చంద్రుని దక్షిణ ద్రవంపై విజయవంతంగా ల్యాండ్ కావటం ఇది శాస్త్రవేత్తల విజయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో చాట్ల లక్ష్మీనారాయణ, రవణం వేణుగోపాలరావు ,కొప్పిశెట్టి నాగేశ్వరరావు, మహిళా ఆరోగ్య సంస్థ అధ్యక్షురాలు జల్లి సుజాత, కడలి సత్యనారాయణ, డాక్టర్ శ్రీపాద రామకృష్ణ పాల్గొన్నారు.