ANDHRA PRADESHOFFICIALPOLITICS
విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఉదయమే ఆకస్మిక తనిఖీ నిర్వహించిన బిజెపి ఎంపీ జివిఎల్

విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉదయమే ఆకస్మిక తనిఖీ నిర్వహించిన బిజెపి ఎంపీ జీవీఎల్
(యువతరం ఆగస్టు 25)
విశాఖ ప్రతినిధి:
శుక్రవారం ఉదయం బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఉదయం 5.30 గం లకు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పలువురు ప్రయాణీకులను మరియు రైల్వే కోచ్ క్లీనింగ్ వర్కర్లను,కూలీలను కలిసి వారి స్థితిగతులపై మరియు వారి పని తీరుపై,సౌకర్యాలపై చర్చించడం జరిగింది.ఈ సందర్బంగా స్టేషన్లో పలువురు ప్రయాణీకులు పలు సమస్యలను జీవీఎల్ దృష్టికి తీసుకు రాగా వాటిపై సంబంధిత అధికారులతో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా జీవీఎల్ రైల్వేస్టేషన్లో వయోవృద్ధులు మరియు దివ్యాంగుల కోసం నడుపబడుతున్న బ్యాటరీ కార్ వంటి సౌకర్యాల పనితీరును పరిశీలించారు.