నంద్యాల జిల్లా విద్యా సమగ్ర అభివృద్ధికై ప్రారంభమైన విద్యార్థి సంగ్రామ బైక్ యాత్ర

నంద్యాల జిల్లా విద్యా సమగ్ర అభివృద్ధికై ప్రారంభమైన విద్యార్ధి సంగ్రామ బైక్ యాత్ర…SFI
(యువతరం ఆగస్టు 23) డోన్ ప్రతినిధి:
పేద విద్యార్థులకు విద్యా అందని ద్రాక్ష పండులా మారుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జి.ఓ.107,108 ద్వారా వైద్య విద్యను బడుగు బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వనికి తగిన గుణపాఠం చెప్పాలని SFI నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డక్క కుమార్,A.నిరంజన్ పిలుపునిచ్చారు
మొదటి రోజు ప్యాపిలిలో యాత్ర ప్రారంభించి డోన్ పట్టణం చేరుకున్నారు డోన్ పట్టణంలో 500 మంది విద్యార్థులతో పాత బస్టాండ్ లో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు డోన్ మండల అధ్యక్షులు మహబూబ్ బాషా అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా SFI నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డక్క కుమార్,నిరంజన్,జిల్లా ఉపాధ్యక్షులు ఇర్ఫానా బేగం,జె.అశోక్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుండి రాజమహేంద్రవరం,నంద్యాల, మచిలీపట్నం,విజయనగరం ఏలూరుల్లో ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో 150 చొప్పున 750 సీట్ల భర్తీకి జాతీయ విద్యా కమిషన్ ఆమోదం తెలపగా దానిలో జాతీయ కోట కింద 15% 112 సీట్లు వెళ్ళగా మిగిలిన 638 సీట్లలో 50%లో (25% సీట్లు ఓపెన్ కేటగిరి కింద 25% రిజర్వేషన్ కేటగిరి) కన్వీనర్ కోటాలో రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేశారు. మిగిలిన 50 శాతం సీట్లలో 35% బి కేటగిరి (సెల్ ఫైనాన్స్) కింద, 15% ఎన్నారై కోట కింద భర్తీ చేస్తున్నారు ఇలా ప్రతి కళాశాలలోనూ 50 శాతం సీట్లు అమ్మకానికి పెట్టారు దీంతో ఐదు కళాశాలలో ఎస్సీ విద్యార్థులు 48 సీట్లు ఎస్టీ విద్యార్థులు 19 సీట్లు బీసీ విద్యార్థులు 93 సీట్లు చొప్పున మొత్తం 160 సీట్లు నష్టపోయారు అని తెలియజేశారు. అదేవిధంగా జిల్లాలో సంక్షేమం వసతి గృహాలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయని కొన్ని ఎస్సీ,ఎస్టీ, బీసీ వసతి గృహాలు శిథిలావస్థలో గోడల పైపెచ్చులు ఊడి విద్యార్థుల పైన పడుతున్నాయని వర్షం పడితే గదులన్నీ కారే స్థితిలో ఉన్నాయి అని నాడు నేడు పథకం కింద సంక్షేమ హాస్టల్ లోని చేర్చి అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక పని కూడా మొదలు పెట్టలేదని మండిపడ్డారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు అందించలేదని చెప్పడం సరైన పద్ధతి కాదని విద్యార్థులకు పాఠ్యపుస్తకాల అందించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వము ఉందని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. యూనివర్సిటీని నెలకొల్పాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు లేనియెడల జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి మాణిక్యం శెట్టి,ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు షేమిమ్ బేగం, సిఐటియు నాయకులు శివరాం, నక్కిశ్రీకాంత్, రామాంజనేయులు, అమృత,మా దేవి,డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు అబీబ్ భాషా,నక్కి హరి, రామలింగం, శీను, ఎస్ఎఫ్ఐ నాయకులు సురేష్, మల్లికార్జున, మహేంద్ర, శివ,మహేంద్ర, శ్రీనివాసులు,గిడ్డ య్య, మోహన్ రెడ్డి, మహిపాల్, సోమనాథ్ రెడ్డి, మహేష్,లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.