ANDHRA PRADESHPOLITICS
వార్డు ఎన్నికలలో చెరోస్థానం కైవసం చేసుకున్న వైసిపి,తెదేపా

వార్డు ఎన్నికలలో చేరో స్థానంకైవసం చేసుకున్న వైసిపి, తెదాపా,పార్టీలు
(యువతరం ఆగస్టు 19) అమడగురు విలేకరి
ఆమడగూరు మండలంలో జరిగిన గ్రామ పంచాయతీ వార్డ్ ఎన్నికల్లో అధికార వైసిపి, ప్రతిపక్ష పార్టీ తేదాపా పార్టీలు చె రోస్థానాన్ని కైవసం చేసుకున్నాయి. మండలంలోని ఆమడగూరు గ్రామపంచాయతీ 11వ వార్డు జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సిపి మద్దతుదారుడు నారాయణస్వామి తెదాపా అభ్యర్థిపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అలాగే మండలంలోని చిన్నగా పల్లి గ్రామపంచాయతీ 3 వ వార్డు జరిగిన ఎన్నికలలో తెదాపా మద్దతుదారుడు దేవరాజ్ 9 ఓట్లతో విజయం సాధించారు. అయితే వైసిపి రెబల్ అభ్యర్థులు ఇద్దరు బరిలో ఉండడంతో తేదాపా విజయం సాధించింది. కౌంటింగ్ సందర్భంగా సి ఐ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.