తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ తో కౌన్సిలర్ల భేటీ

తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ తో కౌన్సిలర్ల భేటీ
(యువతరం ఆగస్టు 16) తాడిపత్రి ప్రతినిధి:
తాడిపత్రి పట్టణంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విషయమై మున్సిపల్ కమిషనర్ తో కౌన్సిలర్లు చర్చించడం జరిగినది .పట్టణంలో పలు వార్డులలో పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని రోడ్లమీదకి డ్రైనేజీ నీళ్లు వస్తున్నాయి అని తెలిపారు. డ్రైనేజ్ సిస్టంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి,త్వరగా పరిష్కరించాలని కమిషనర్ ని కోరడం జరిగినది. అలాగే తాడిపత్రి పట్టణంలోని పలు మున్సిపల్ ఆస్తులు అన్నాక్రాంతమవుతున్నాయి అని వాటిని కాపాడి మున్సిపాలిటీ ఆస్తుల రక్షించి,కాపాడాలని తాడిపత్రి కమిషనర్ కి కౌన్సిలర్లు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి .రవి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మహబూబ్ బాషా, వైస్ చైర్మన్ అబ్దుల్ రహీం, సరస్వతి కౌన్సిలర్లు విజయ్ కుమార్, జింక లక్ష్మీదేవి ,శేక్షావలి పాల్గొన్నారు.