
ఎర్రమట్టి దిబ్బలు కాపాడుకుంటాం
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్
(యువతరం ఆగస్టు 17) విశాఖ ప్రతినిధి:
భీమునిపట్నం మండలంలో ఎర్ర దిబ్బలు చారిత్రాత్మ కమైనవని మనదేశంలో మూడే మూడు ఎర్ర దిబ్బలు కనిపిస్తాయి అందులో రెండు కనుమరుగు అవ్వగా ఇప్పుడు ప్రత్యేకంగా కనిపించింది భీమిలి ఎర్రమట్టి దిబ్బలు మాత్రమేనని వీటిని కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు సుమారు 60 ఎకరాల ఎర్రమట్టిదిబ్బలు ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారనీ అన్నారు. వైసిపి ప్రభుత్వం ఎక్కడకక్కడ ప్రభుత్వ భూములను కొండలను ఆక్రమించుకొని ఇస్టా రాజ్యంగా వ్యవహరిస్తే సహించనని హెచ్చరించారు. ఎంతో ప్రాముఖ్యతమైన ఎర్రమట్టి దిబ్బలు కేవలం 200 ఎకరాలలో మాత్రమే ఇప్పుడు ఉందని. మిగతా అంతా ఆక్రమణకు గురవుతుందని తెలిపారు. న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ పంచకర్ల రమేష్ బాబు పంచకర్ల సందీప్ స్థానిక జనసేన నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.