STATE NEWSTELANGANA

77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

(యువతరం ఆగస్టు 15) జమ్మికుంట విలేఖరి:

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 16 వ వార్డులో వారియర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంగళ వారం ఘనంగా జరిపారు. అలాగే ఫౌండేషన్ అధ్యక్షులు మిడిదొడ్డి శివాజీ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంతో పాటు సమాజంలో జరిగే గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం డాక్టర్లచే వైద్య సలహాలు ఇప్పించడం, చదువుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయం వృద్ధులకు అండగా ఉండటం ఫౌండేషన్ ద్వారా అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ మెంబర్స్, విద్యార్థిని విద్యార్థులు, మహిళలు, వృద్ధులు మరియు వార్డు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!