
అక్రమ కేసులు పెట్టేందుకే ఎమ్మెల్యే పర్యటన
– అధికారిక పర్యటనకు ఐదు మండలాల కార్యకర్తలు ఎందుకు
– ముందస్తు ప్రణాళికలో భాగంగానే పోలీసుల మోహరింపు
– టిడిపి గ్రామం కావడంతో వేధింపులకు ఎత్తుగడ లో భాగం
(యువతరం ఆగస్టు 11) పత్తికొండ ప్రతినిధి;
టిడిపికి కంచుకోటగా ఉన్న గ్రామంలో అక్రమ కేసులు పెట్టాలనే కోణంలోనే ఎమ్మెల్యే శ్రీదేవి పుచ్చకాయలమాడ గ్రామ పర్యటనజరిగిందని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కే.ఈ.శ్యామ్ బాబు అన్నారు. శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారిక పర్యటనకు ఎమ్మెల్యేలు సాధారణంగా అధికారులు సిబ్బందితో పర్యటిస్తారన్నారు. అయితే పుచ్చకాయల మడ పర్యటనలో ముందస్తుగా గ్రామంలో వందల మంది పోలీసులను మోహరింపచేశరని, ఐదు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలను వందల మందిని గ్రామానికి ఎమ్మెల్యే ఎందుకు తీసుకెళ్లారో చెప్పాలన్నారు. నాలుగున్నర ఏళ్ల కాలంలో తమ గ్రామానికి ఏం చేశారో చెప్పాలని ప్రజలు ప్రశ్నించడం నేరంగా చూపడం దారుణం అన్నారు. వందల మందితో గ్రామంలో అంతా అలజడి సృష్టించినఎమ్మెల్యే తమ గ్రామానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించిన గ్రామస్తులపై రాత్రికి రాత్రి నాన్బెయిలబుల్ కేసులు పెట్టించడం దారుణం అన్నారు. గ్రామంలో టిడిపి ఆధిపత్యం తగ్గించాలన్న పథకంతోటే ఎమ్మెల్యే కార్యక్రమం సాగిందని, అక్రమ కేసులకు గురైన గ్రామస్తుల తరపున తాము న్యాయపోరాటం చేస్తామని, కోర్టు ద్వారా న్యాయం కోసం పోరాడుతామన్నారు. ఆయనతోపాటు టిడిపి నాయకులు బత్తిన వెంకటరాముడు రామానాయుడు మనోహర్ చౌదరి అశోక్ కుమార్, తిరుపాల్, సొమ్లనాయక్, ధనుంజయుడు శ్రీనివాసులు గౌడ్ కడవల సుధాకర్,శ్రీకాంత్, నాయకులు కార్యకర్తలు ఉన్నారు