
సీఎం జగన్ కు ఎన్ని ఇళ్లు కావాలి?: పవన్
(యువతరం ఆగస్టు 11)
విశాఖ ప్రతినిధి:
పోలీసుల ఆంక్షల మధ్య విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన వారం కొనసాగు తోంది. ఎట్టకేలకు ఆంక్షల మధ్య రుషికొండను పవన్ పరిశీలించారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడు తూ ఉత్తరాంధ్రను దోపిడీ చేస్తున్నారన్నారు. రుషికొండపై నిర్మాణా లకు అన్ని అనుమతులు వచ్చాయా అని ప్రశ్నించారు. తుపాన్లు వచ్చినప్పుడు రుషికొండ కాపాడుతుంది అని తెలిపారు. ఉత్తరాంధ్ర భూములు, ఆస్తులపై వైకాపా నేతల కళ్లు పడ్డాయి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను అడ్డగోలుగా దోచు కుంటున్నారని ఆరోపించారు. తెలంగాణను కూడా ఇలాగే దోచేశారన్నారు. జగన్ కు ఎన్ని ఇళ్లు కావాలన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా దోచేసాడు ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ దృష్టి పెట్టాలి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల భూములను ప్రజల దగ్గర లాక్కుంటున్నారని పేర్కొన్నారు. చట్టాలు కాపాడివలసిన ముఖ్యమంత్రి చట్టాలను ఉల్లంగిస్తారన్నారు. రుషి కొండ నిర్మాణం అంతా పుర్తిగా వైలేషన్ చేసి కట్టారన్నారు. ఇక్కడ ప్రజలు శాంతి యుతంగా ఉన్న ప్రజల పై దోపిడీ చేయడం జగన్ సర్కార్ అన్యాయం చేస్తుంది అని దుయ్యబట్టారు. మరోసారి ఋషికొండ లో జగన్ పై ఘాటైన విమర్శలు పవన్ కళ్యాణ్ చేశారు.