జగన్ రెడ్డిది నియంత పాలన

జగన్ రెడ్డిది నియంత పాలన
పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
(యువతరం ఆగస్టు 9) విశాఖ ప్రతినిధి:
బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పల్లా మాట్లాడుతూజగన్ దురాగతాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా జగన్ రెడ్డి నియంత పాలన చేస్తున్నాడని అన్నారు చంద్రబాబు చేపట్టిన పెన్నా నది నుండి వంశధార యాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తోంది అని అన్నారు
అది చూసి ఓర్వలేక తప్పుడు కేసులు పెట్టారు రాయలసీమలో పర్యటనకు విశేష ఆదరణ వచ్చింది అని అన్నారు వచ్చిన ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబుపై హత్యాయత్నం నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు అని చెప్పారు
కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి టిడిపి అధికారంలో వున్నపుడు ప్రతిపక్షాల పాదయాత్రలకు ఎలాంటి అవరోధాలు కలిగించలేదని అన్నారు
తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో ఇటీవల జరిగిన పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు
అవాంఛనీయ సంఘటనలను పోలీసులు అడ్డుకోవాల్సిన అవసరం లేదా ఏకపక్షంగా పోలీసులు ఎలా వ్యవహరిస్తారు అని అన్నారు
ముదివీడు పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు సహా 20 మందికి పైగా టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు పెట్టారు ఇది రాజకీయ కక్షసాధింపు స్పష్టంగా కనిపిస్తోంది అని అన్నారు వైసిపి పాలనలో సుజల స్రవంతి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు అని అన్నారు.