ANDHRA PRADESHEDUCATION
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్

మధ్యాహ్నం భోజనాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్.
ఆస్పరి యువతరం విలేఖరి;
ఆస్పరి మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని బుధవారం ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ , పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు అందించే మధ్యాహ్నం భోజన పథకం నాణ్యతను రుచి చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అందించాలని సూచించారు. అలా అందించని ఎడల ప్రధానఉపాధ్యాయుల పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాలలోని వసతులు తదితర వాటిపై అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులతో మాట్లాడుతూ విద్యాభ్యాసంలో ముందుండి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం స్టోర్ రూమ్ లో ఉన్న బియ్యం నాణ్యతను పరిశీలించారు.