అమరుడు అరుళయ్య

అమరుడు అరుళయ్య
(యువతరం ) కడప ప్రతినిధి;
ఈ లోకంలో పుట్టిన వారందరికీ ఒక రోజు మరణం ద్వారా లోకానికి దూరం కావాల్సిందే! అయితే! తన జీవితంలో ఇతరుల ప్రయోజనాల కోసం, వారి అభివృద్ధి కోసం, ఎదుటివారు సుఖసంతోషాలతో సంతోషంగా ఉండాలని, అహర్నిశలు వారికోసం జీవించిన మహనీయులు అరులయ్య అమరుడేనని అరులయ్య పేరుకు మరణమే లేదని,
శాంతి సేవా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మడగలం ప్రసాద్ సోమవారం పేర్కొన్నారు.
అరులయ్య 20వ వర్ధంతి సందర్భంగా మరియాపురం జూనియర్ కళాశాలలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజానికి, పేదప్రజలకు ఉన్నతమైన సేవలు అందించడం ద్వారా అరులయ్య అమరుడు గా సొసైటీలో పిలువబడుతున్నారని ఆయన తెలిపారు.
బావితరాల ప్రజలకు ఆయన ఆదర్శంగా నిలిచారని, అందుకు కారణం ఆయన జీవించిన జీవితము, చేసిన అభివృద్ధి కార్యక్రమాలేనని ఆయన తెలిపారు.
ప్రతి ఒక్కరూ నీ జీవితకాలంలో గుర్తుండిపోయే పనులను చేయాలని, వాటి ద్వారా మీరు మరణించినను జీవించిన వారై ఉంటారని ఆయన కోరారు.
ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం నందు ఆరోగ్యమాత కాన్వెంట్ సభ ఆధ్వర్యంలో మరియాపురం పెద్ద చర్చిలో మాసాపేట డాన్ బోస్కో నందు ఘనంగా ఆయన వర్ధంతిని నిర్వహించారు.