రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
ధర్మవరం యువతరం విలేఖరి;
ధర్మవరం స్థానిక ప్రెస్ క్లబ్ లో రజకుల వృత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో నాయకులు బద్దలాపురం నరసింహులు అధ్యక్షతన విలేకరులు బుధవారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రజక వృత్తదారుల సమస్య రాష్ట్ర నాయకులు లింగమయ్య, అనంతపురం జిల్లా నాయకులు సి నాగప్ప హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బద్దలాపురం నరసింహులు మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, రజకులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని, రజకుల పైన జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు, మానభంగాలు, గ్రామ బహిష్కరణలు వెంటనే ఆపాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈనెల 21న రాయలసీమ అనంతపురం నడి ఒడ్డున జరిగే రజక రాష్ట్ర మహాసభకు పెద్ద ఎత్తున రజకులు తరలివచ్చి ఈ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ముత్యాలమ్మ, గొట్లురు రామకృష్ణ,మురళి, రామాంజనేయులు, మల్లానపల్లె హరికృష్ణ,నాగరాజు, మల్లి, శ్రీనివాసులు, సుగుణ తదితరులు పాల్గొన్నారు.