
చట్టాన్ని ఎవరూ చేతులోనికి తీసుకోవద్దు
డోన్ యువతరం ప్రతినిధి;
చట్టాన్ని ఎవరు అతిక్రమించి చేతులోనికి తీసుకోవద్దని బుధవారం రూరల్ ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. చట్టానికి అందరూ సమానమేనన్నారు. అసాంఘికాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. సమస్యలు ఏవైనా పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పాణ్యం లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై సుధాకర్ రెడ్డి డోన్ రూరల్ కు రాగా, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్సై సురేష్ సిరివెళ్ళకు బదిలీ అయ్యారు.