ANDHRA PRADESHOFFICIAL
డోన్ టౌన్ సిఐ గా ప్రవీణ్ కుమార్

డోన్ టౌన్ సిఐ గా ప్రవీణ్ కుమార్
డోన్ యువతరం ప్రతినిధి;
డోన్ టౌన్ సిఐ గా ప్రవీణ్ కుమార్ బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. గతంలో విధులు నిర్వహిస్తున్న సిఐ శేషయ్య విఆర్ కు వెళ్లినట్లు సమాచారం. ఈ సందర్భంగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తన సర్కిల్ పరిధిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించవచ్చన్నారు. చిన్న,చిన్న గొడవలను పెద్దదిగా చేసుకోకుండా రాజీ మార్గంలో పయనించాలన్నారు. ఎవరికైనా అసాంఘిక కాల గురించి తెలిస్తే తమకు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా తెలిపారు.