మానవత్వం పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి

మానవత్వం పై ప్రతివారికి అవగాహన కల్పించాలి
తెనాలి యువతరం ప్రతినిధి;
సమాజంలోని ప్రతివారికి మానవత్వం పై అవగాహన కల్పించాలని మానవతా స్వఛ్ఛందసంస్థ వ్యవస్థాపకులు &కేంద్ర నియంత్రణ కమిటి ఛైర్మన్ యన్.రామచంద్రారెడ్డి అన్నారు.మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన శాఖ ఆదివారం తెనాలిలో ప్రారంభ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలలపై కరుణ, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నారు.
ఈ కార్యక్రమానికి ఏ ఎస్ ఎన్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్ చంద్ అధ్యక్షత వహించారు.
ఈ మానవతా సంస్థ తెనాలి నూతన మొదటి కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం రీజినల్ చైర్మన్ గాను మునగల శ్యాం ప్రసాద్ , ఘట్టమనేని నాగేశ్వరరావు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ మరియు తెనాలి పట్టణ ప్రముఖులు వరద రాజులు ముఖ్య సలహాదారులుగా నిర్ణయించడమైనది.
డాక్టర్ రామ్ చంద్ చైర్మన్ గా డాక్టర్ శారద కో చైర్మన్ కళ్యాణి ప్రెసిడెంట్ గా, శ్రీనివాస బాబు సెక్రటరీగాను, రిటైర్డ్ ప్రిన్సిపాల్ సోమయ్య శాస్త్రి, కటకం ప్రసాద్ మరియు వెంపటి సత్యనారాయణ గార్లు డైరెక్టర్లు గాను శర్మ గారు, ధనుంజయ రావు గారు రాజేశ్వరి గారు మరియు రాఘవరెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా ప్రమాణస్వీకారం చేశారు . పోస్ట్ శ్రీనివాస బాబు గారు మానవతా సంస్థకు మార్చురీ ఫ్రీజర్ బాక్స్ ను విరాళంగా ప్రకటించారు.
మానవతా గుంటూరు శాఖ చైర్మన్ పావులూరి రమేష్ , డైరెక్టర్ ఉప్పల సాంబశివరావుఈ కార్యక్రమం మొత్తం పర్యవేక్షించారు. సమావేశం ప్రారంభంలో ప్రముఖ గాయకుడు వెంపటి సత్యనారాయణ గారు గాన లహరి అందించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ రామానుజులు రెడ్డి మరియు స్టేట్ కన్వీనర్ జానకిరామరాజు ప్రసంగించారు.