ఉమ్మడి పౌర స్మృతిని తిప్పి కొట్టాలి

ఉమ్మడి పౌరస్మృతిని తిప్పి కొట్టాలి
తెనాలి యువతరం ప్రతినిధి;
కేంద్రం తలపెట్టిన ఉమ్మడి పౌరస్మృతిని తిప్పికొట్టాలని ప్రముఖ సామాజిక విశ్లేషకులు జి. భార్గవ అన్నారు . ఆదివారం
కవిరాజు పార్కులో ఉమ్మడి పౌర స్మృతిపై చర్చ వేదికలో మాట్లాడుతూ ప్రముఖ సామాజిక విశ్లేషకులు జి భార్గవ్ గా పాల్గొని ప్రసంగిస్తూ భారతదేశంలో భిన్న మతాలు విభిన్న జాతులతో భిన్నత్వంతో కూడుకున్న దేశంలో మతాలు ఉన్న దేశంలో దేశమంతా ఒకే క్రిమినల్ కోడ్ (ఐపీసీ) నే అమ చేయలేని పాలకులు ఎన్నో సంక్లిష్టంగా సమాజం ఉందని ఇటువంటి భిన్న సంస్కృతులను ఏకం చేయడానికి ఉమ్మడి పౌరస్మృతిని చట్టంగా తెచ్చిఅమలు చేసే నైతిక హక్కు లేదని ఎన్నికల కోసం బిజెపి ప్రభుత్వం మోసపూరిత పాత్రను పోషిస్తుందని వివరించారు. దేశవ్యాప్తంగా కామన్ సివిల్ క్రిమినల్ కోడ్ ఉంది. దానిని అమలు చేయలేని ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని చట్టంగా తెస్తాననేది హాస్యాస్పదమని అభివర్ణించారు.
ఈ సభకు శివనాగేశ్వరరావు (భిన్నస్వరాలు) అథ్యక్షతవహించగా బెన్హర్ ఉమ్మడి పౌరస్మృతి విభిన్న కులాలు మతాలున్న దేశానికి అఅనవసరమన్నారు.
ఈ చర్చల్లో సిపిఎం నాయకులు హుస్సేన్ వలి, సందే నాగేశ్వరరావు లోకం భాస్కరరావు, భారత్ బచావో ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ సభ్యులు బత్తుల కోటేశ్వరరావు పికేస్ నాయకులు సుధాకర్, రైతుకూలీ సంఘం నాయకులు బ్రహ్మయ్య గారు తదితరులు పాల్గొన్నారు,
భారత్ బచావో నిర్వాహకులు
కోలా నవజ్యోతి 2024లో బిజెపి ఆర్ఎస్ఎస్ మనువాద కార్పోరేట్ ఫ్యాసిస్టు శక్తులు అధికారంలోకి వస్తే మనుస్మృతినే రాజ్యాంగంగా ప్రకటించేందుకు ఆసక్తి చూపుతూన్నాయని 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దాని మిత్ర పక్షాలను ఓడించాలని అన్నారు.