విశాఖలో ఘనంగా మంత్రి బొత్స జన్మదిన వేడుకలు
ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు

విశాఖలో ఘనంగా మంత్రి బొత్స జన్మదిన వేడుకలు
ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు
విశాఖ యువతరం ప్రతినిధి
ఏపీ ప్రైవేట్ పాఠశాలల తల్లిదండ్రుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ లో తెల్లవారుజామున వినాయకునికి అభిషేకంతో ప్రారంభించి, వృద్ధులకు , అరకు ప్రాంతంలో ఆదివాసీలకు పండ్లు పంపిణీ, విద్యార్థులకు పుస్తకాలు మరియు నిరుద్యోగ యువతకు ఉచితంగా గ్రూప్ 2 మరియు అన్ని కాంపిటీటివ్ పోటీ పరీక్షలకు సంబంధించిన మెంటల్ ఎబిలిటీ పుస్తకాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా హేమంత్ మాట్లాడుతూ త్వరలోనే మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ ఉద్యోగ వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచి విడుదల చేయాలని. ఎస్ఐ ,కానిస్టేబుల్ అభ్యర్థులకు గత సచివాలయ తరహాలో 15 గ్రేస్ మార్కులు వేసి ఆదుకోవాలని, ప్రభుత్వ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే ప్రతి నిరుద్యోగి కి ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా ఉచిత స్టడీ మెటీరియల్ ఇవ్వాలని హేమంత్ మంత్రి బొత్స ని వారి నివాసంలో పుట్టినరోజు సందర్భంగా కలిసి కోరడం జరిగింది. బొత్స సానుకూలంగా స్పందిస్తూ నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధపడాలని, త్వరలోనే నోటిఫికేషన్ అన్ని విడుదల అవుతాయని అన్నారు. మంత్రి బొత్స గారికి హేమంత్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు.