ANDHRA PRADESHCRIME NEWSSTATE NEWS

సమిష్టి కృషితో రోడ్డు ప్రమాదాలు నియంత్రించండి

జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్

సమిష్టి కృషితో రోడ్డు ప్రమాదాలు నియంత్రించండి

జిల్లా ఎస్పీ  జి. కృష్ణకాంత్

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి పై చర్యలు తప్పవు

జాతీయ రహాదారుల పై రాంగ్ రూట్ లలో వెళ్ళవద్దు

వాహనదారులు తమ భద్రతకు పోలీసుల సూచనలు పాటిస్తూ గమ్యాలకు క్షేమంగా చేరాలి

ఇతరులకు , తమకు ప్రాణనష్టం జరగకుండా తమ ప్రాణాలను రక్షించుకోవాలి

కర్నూలు యువతరం ప్రతినిధి;

రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన చేసేలా చర్యలు చేపట్టాలని, జరిమానాల కంటే అవగాహన కల్పించడం ముఖ్యమని జిల్లా పోలీసు యంత్రాంగం సమిష్టిగా కృషి చేసి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని ఆదివారం జిల్లా ఎస్పీ  జి. కృష్ణకాంత్ తెలిపారు.గత 6 నెలలుగా ( జనవరి నెల నుండి జూన్ నెల వరకు) జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై పోలీసులు తీసుకున్న చర్యల వివరాలను ఆదివారం విడుదల చేశారు .

ఇందులో ప్రధానంగా

వాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్సులు లేని వారిపై 3,506 కేసులు.

హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన చోదకులపై 37,483 కేసులు, మైనర్ల పై 303 కేసులు.

ఒన్ వే లో రాంగ్ రూట్ వెళ్ళిన వారిపై 1,393 కేసులు.

మొబైల్ మాట్లాడుతూ వాహనం నడిపిన వారి పై 1,716 కేసులు.

జంపింగ్ సిగ్నల్స్ చేసిన వారి పై 58 కేసులు.

ఏలాంటి రికార్డులు పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వారి పై 64,926 కేసులు.

సీటు బెల్టు ధరించకుండా వెళ్తున్న కార్లు , జీపులు , తదితర వాహన చోదకుల పై 4,127 కేసులు.

అతి వేగంతో వెళ్లి న వాహనాల పై 12,214 కేసులు.

ఓవర్ లోడ్ తో వెళ్ళిన వాహనాల పై మోటారు వాహనాల చట్టం కింద 1,819 కేసులు.

త్రిబుల్ రైడింగ్ పై 6,612 కేసులు.

రాంగ్ పార్కింగ్ చేసిన ద్విచక్రవాహానాల పై 4,230 కేసులు.

రాంగ్ పార్కింగ్ చేసిన త్రీ వీలర్ మరియు ఫోర్ వీలర్ వాహానాల పై 3,602 కేసులు.

నంబర్ ప్లేట్ లేని వాహనాల పై 2,536 కేసులు.

డ్రంకెన్ డ్రైవ్ పై 819 కేసులు నమోదు చేశామన్నారు.

మొత్తం 5 లక్షల 59 వేల ఈ – చలనాలు పెండింగ్ లో ఉన్నాయని, ఇందులో( జనవరి నుండి జూన్ వరకు) 1, 55, 947 ఈ – చలనాలను (రూ. 3 కోట్ల 6 లక్షల 4 వేల 445 రూపాయలను) రికవరీ చేశామన్నారు.రోడ్డు ప్రమాదాలు జరిగినా , రహదారులపై ఇబ్బందికరంగా వాహనాలు నిలిపినా వెంటనే డయల్ 100 కు సమాచారం చేరవేయాలని జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ  జి. కృష్ణకాంత్  విజ్ఞప్తి చేశారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!