డెంగ్యూ నివారణ మాసోత్సవం

డెంగ్యూ నివారణ మాసోత్సవం
అమడగూరు యువతరం విలేఖరి;
మండల పరిధిలోని తనకంటివారిపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.మూనా అధ్వర్యంలో ,పి. హెచ్. సి సిబ్బంది అలాగే కదిరి పడమర మలేరియా సబ్ యూనిట్ అధికారి తో కలసి ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా ఇంటింటికీ తిరిగి సీజనల్ వ్యాధులు రాకుండా ముఖ్యంగా డెంగీ మలేరియా వ్యాధులపై అవగాహన కల్పించారు. కొన్ని ఇళ్లలో ఎక్కువ రోజులుగా నిల్వ వున్న నీటి డ్రమ్ములను తొట్టెలను బిందెలను పరిశీలించి నిల్వ ఉన్న పరిశుభ్రంగా లేని నీటిని పడబోయించి శుభ్రము చేయించారు. ఇళ్లలో పైరెత్రం మందును పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా మలేరియా సబ్ యూనిట్ అధికారి దేవలా నాయక్ మాట్లాడుతూ ప్రజలు దోమ కాటుకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇళ్లలో ఎక్కువ రోజులు నీటి నిల్వ ఉండరాదని అన్నారు. అందుకే ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలన్నారు. సి. హెచ్. ఓ .ఫక్రుద్దీన్ మాట్లాడుతూ అందరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తదుపరి చిరు వ్యాధులకు చికిత్సలు అందచేశారు. ఈ
కార్యక్రమములో సూపర్ వైజర్ ఇర్ఫాన్ బాష, యమ్. యల్. హెచ్. పి.. భిక్షావతి, హెల్త్ అసిస్టెంట్ గోపాల్ నాయక్, ఏ. యన్. యమ్. మంజులమ్మ , ఆశా కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.