ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని సన్మానం చేసిన మాజీ వెయిట్ లిఫ్టర్స్

ఎమ్యెల్యే చెన్నకేశవరెడ్డిని సన్మానం చేసిన మాజీ వెయిట్ లిఫ్టర్స్
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
పట్టణంలో గత 35 సంవత్సరముల క్రితం దేహదారుడ్యము, మానసిక ఉల్లాసము కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు గతమును గుర్తుచేసుకొని నెమరు వేసుకుంటూ అందరూ ఒక కలయిక కలవాలని చేసిన మాచాని శివకుమార్, ఎంకప్ప, దేవరాజు ల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎమ్యెల్యేకె.చెన్నకేశవరెడ్డి కలిసి సన్మానం చేశారు.ఈ సందర్భంగా మాజీ వెయిట్ లిఫ్టర్స్ శివకుమార్, ఎంకప్ప, దేవరాజు మాట్లాడుతూ గతంలో మాకు పెద్దలు చెన్నకేశవ రెడ్డి సహాయ సహకారాలను అందిస్తూ ఎమ్మిగనూరుకు మంచి పేరు, ఖ్యాతిని తీసుకురావాలని ఉద్దేశంతో పోటీ కొరకు వివిధ సుదూర ప్రాంతాలకు వెళ్ళుటకు క్రీడాకారులమైన మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ఏమాత్రం డబ్బుకు వెనకాడకుండా మాకు ఎంతో సహాయాన్ని అందజేశారని ఈ కలయిక మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేస్తూ ఈ వెయిట్ లిఫ్టింగ్ క్రీడను పూర్వపు వైభవాన్ని తీసుకొని వస్తామని అందుకు అవసరమైన స్థలమును మాకు కేటాయిస్తే అందులో ఒక కోచింగ్ సెంటర్ ను కట్టించి యువతకు అందుబాటులో ఉంచుతామని స్థానిక శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డిని విన్నపమును తెలియజేసారు.ఈ సందర్భంగా ఎమ్యెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ దీని కొరకు కావలసిన స్థలంను నేను కచ్చితంగా మీకు ఏర్పాటు చేస్తానని తెలిపారు అందుకు క్రీడాకారులు అందరూ హర్షద్వానాలతో చెన్నకేశవరెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు వైస్ ఎంపీపీ పోలయ్య, రహీం,నీలకంఠ, లింగ బాయి మరియు యువ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.