ANDHRA PRADESHPOLITICSSTATE NEWS
ముఖ్యమంత్రి సమక్షంలో వైసిపి లో చేరిన శాంతిరాం విద్యాసంస్థల అధినేత

ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరిన నంద్యాల శాంతిరాం విద్యాసంస్థల అధినేత
అమరావతి యువతరం ప్రతినిధి;
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంద్యాల శాంతిరామ్ విద్యాసంస్ధల అధినేత డా. ఎం. శాంతిరాముడు, ఆయన తనయుడు శివరామ్ చేరారు.
ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్యెల్యే,టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ,నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మనందరెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి లు పాల్గొన్నారు.