
యువతరం ఎఫెక్ట్
పారిశుద్ధ పనులు ప్రారంభించినసర్పంచ్ షబ్బీర్
అమడగూ రు యువతరం విలేఖరి;
రోడ్డుపై చెత్త అనే శీర్షికను యువతరంలో ప్రచురించడం జరిగింది. దీనిపై స్పందించి పరిశుభ్రం చేయడం జరిగింది.మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో పరిశుద్ధం నెలకొనడంతో బస్టాండ్ ప్రాంతంలో ఎక్కడపడితే అక్కడ చెత్త ఉండడంతో సర్పంచ్ షబ్బీర్ బుధవారం జెసిబి ద్వారా బస్టాండ్ ప్రాంతంలో నెలకొన్న అపరిశుభ్రతను తొలగించారు. అలాగే పరిశుద్ధ కార్మికులచే చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ షబ్బీర్ మాట్లాడుతూ మండల కేంద్రంలో బస్టాండ్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న అపరశుభ్రతను తొలగించామని దాంతో గ్రామస్తులు మంచి ఆరోగ్యవంతులుగా తయారవ్వాలని నా ఆకాంక్షని సర్పంచ్ షబ్బీర్ పేర్కొన్నారు. అలాగే మండల కేంద్రంలోని అన్ని కాలనీలో నెలకొన్న అపరిశుభ్రతను తొలగిస్తామని ఆయన తెలిపారు.